భారత్ కు పాకిస్థాన్ గుడ్ న్యూస్..? సంక్షోభం వేళ భారీ ఉపశమనం..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా ఆ రెండు దేశాలతోపాటుగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు వాణిజ్యానికి గుండెకాయగా ఉన్న హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తరుణంలో అనేక దేశాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇందులో పేద, మధ్యతరగతి దేశాలతోపాటుగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉన్నాయి. ఇక అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ లో పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అక్కడి పరిస్థితి మరింతగా దిగజారింది. ఆ దేశంలో ఇప్పుడు చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అయితే హార్మూజ్ జలసంధి నిలిపివేత కారణంగా పాకిస్థాన్ కు ఇరాన్ కు మధ్య చమురు రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ తో రోడ్డు మార్గం ద్వారా వాణిజ్యాన్ని ప్రారంభించింది పాకిస్థాన్.
హార్మూజ్ దిగ్బంధనం నేపథ్యంలో ఇరాన్ తో రోడ్డు వాణిజ్య మార్గాలను పాకిస్థాన్ ప్రారంభించింది. ఈ మేరకు ఇరాన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పాకిస్థాన్ కు ముడి చమురు చేరుకునే అవకాశం ఉంది. పాకిస్థాన్, ఇరాన్ మధ్య దాదాపు 900 కిలోమీటర్ల పొడవైన ఉమ్మడి సరిహద్దు ఉంది. క్వెట్టా నుంచి జాహెదాన్ మధ్య 732 కిలోమీటర్లు ఉంది. ఇది ఇరు దేశాల మధ్య ప్రధాన రోడ్డుమార్గం. అలాగే గ్వాదర్ నుంచి చాబహార్ 210 కిలోమీటర్లుగా ఉంది. ఇది తీర ప్రాంత రోడ్డు మార్గం. అలాగే తఫ్తాన్- మీర్జావే, గబ్ద్- రిమ్డాన్, మండ్- పిషిన్, చాద్గి- కుహక్ రోడ్డు మార్గాలు ఉన్నాయి.
ఇక హార్మూజ్ జలసంధి దిగ్బంధనం, సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ ఇంధన భద్రతను కాపాడుకోవడం కోసం పాకిస్థాన్ ఈ ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాన్ని ఎంచుకుంది. అయితే పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు రవాణా మెరుగుపడితే అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు స్థిరపడే అవకాశం ఉంది. చమురును భారీగా దిగుమతి చేసుకునే భారత్ కు ధరల స్థిరీకరణ కారణంగా భారత్ కు పరోక్షంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే భారత్ ఎప్పుడూ అంతర్జాతీయ నిబంధనలకు కచ్చితంగా పాటిస్తుంది. దీనివల్ల ఇరాన్ నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం కష్టతరంగా మారింది.

ప్రస్తుతం భారత్ వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు 64 శాతం మాత్రమే నిండి ఉన్నట్లు ఇటీవల పార్లమెంటులో కేంద్రం స్పష్టంచేసింది. మొత్తం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి గాను ప్రస్తుతం భారత్ వద్ద 3.37 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వ ఉన్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications