ఆకుకూరలు, టమాటా మిక్సిడ్ పచ్చడి.. ఇలా చేసి తింటే రుచి అదుర్స్!

రుచికరమైన , ఆరోగ్యకరమైన ఇంటి పచ్చడి తినాలని ఎవరు మాత్రం కోరుకోరు. బయట కొనుక్కున్న పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళ కంటే అప్పటికప్పుడు చేసుకుని తినే పచ్చళ్ళు చాలా మంచివి. ముఖ్యంగా ఆకుకూరలు తిననివారు వాటిని పచ్చడిగా చేసి పెడితే ఇష్టంగా తింటారు.

ఆకుకూరలు మరియు టమాటాలతో మిక్సిడ్ పచ్చడి

మనకు ఏ సీజన్ అయినా ఆకుకూరలు దొరుకుతాయి. ఆకుకూరలు మరియు టమాటాలను కలిపి తయారు చేసే ఈ మిక్సిడ్ పచ్చడి అన్నం, రోటి, దోస, ఇడ్లీలతో అద్భుతంగా ఉంటుంది. రుచి మాత్రమే కాకుండా, పోషకాలు కూడా సమృద్ధిగా ఉండే ఈ పచ్చడి ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.

Mixed leafy vegetables and Tomato Chutney prepare it this way and the taste is simply sensational

మిక్సిడ్ ఆకుకూరలు, టమాటాల పచ్చడికి కావాల్సిన పదార్ధాలు

ఆకుకూరలు

పాలకూర- అర కట్ట

తోటకూర- అర కట్ట

చుక్కకూర - అర కట్ట

టమాటాలు: 4-5 (పండినవి)

పచ్చి మిర్చి: 15 (మంటకు తగ్గట్టు)

వెల్లుల్లి రెబ్బలు: 8-10

ఉప్పు: తగినంత

నూనె: 2-3 టేబుల్ స్పూన్లు

జీలకర్ర: 1 టీస్పూన్

ఆవాలు: ½ టీస్పూన్

ఎండు మిర్చి - 3

కరివేపాకు: 1-2 రెమ్మలు

తయారీ విధానం

ముందుగా ఆకుకూరలను బాగా కడిగి, కాడలు తీసివేసి, సన్నగా తరగాలి. టమాటాలను కడిగి ముక్కలుగా కోయాలి. ఆపై స్టవ్ వెలిగించి ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో కట్ చేసుకున్న ఆకుకూరలు, టమాటాలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి. ఆకుకూరలు మెత్తబడి, టమాటాలు, పచ్చిమిర్చి పూర్తిగా ఉడికిన తర్వాత మంట ఆపేయాలి.

పచ్చడి ఇలా చేస్తే సూపర్ రుచి

మిశ్రమం పూర్తిగా చల్లారాక మిక్సీలో ఆకుకూరలు, పచ్చి మిర్చి, టమాటాలు ఉడికిన మిశ్రమం వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి, ఒక స్పూన్ జీలకర్ర, 10వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఒక చిన్న పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపుచేసి పచ్చడిలో పోసి కలపాలి. అంతే రుచికరమైన ఆకుకూరలు, టమాటాల పచ్చడి సిద్ధం అవుతుంది.

మామిడిపండ్ల సీజన్ అని జ్యూస్ లు తెగ తాగేస్తున్నారా? ఇది మీ కోసమే!
మామిడిపండ్ల సీజన్ అని జ్యూస్ లు తెగ తాగేస్తున్నారా? ఇది మీ కోసమే!

మిక్సిడ్ ఆకుకూరలు, టమాటాల పచ్చడికి ముఖ్యమైన చిట్కాలు

ఈ పచ్చడి రుచిగా ఉండాలంటే ఆకుకూరలు తాజాగా ఉండాలి. ఎక్కువ నూనె వేస్తే పచ్చడి రుచి మరింత బాగుంటుంది మరియు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కారం తినగలవారు మంట ఎక్కువగా కావాలంటే పచ్చి మిర్చి ఎక్కువ వేయవచ్చు. ఫ్రిజ్‌లో ఉంచితే 4-5 రోజులు పచ్చడి తాజాగా ఉంటుంది. ఆకుకూరలు టమాటా మిక్సిడ్ పచ్చడి తయారు చేయడం చాలా సులభం మరియు అత్యంత ఆరోగ్యకరం. ఇంట్లో ఒక్కసారి చేస్తే అన్నం రుచి రెట్టింపు అవుతుంది. ఎప్పుడూ తిననంత ఈ పచ్చడితో కచ్చితంగా తింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+