తమిళనాడులో సూపర్ ట్విస్ట్- బయటి నుంచి మద్దతు
తమిళనాడులో సంచలన విజయం సాధించింది.. తమిళగ వెట్రి కజగం (టీవీకే). 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 108 స్థానాల్లో జెండా ఎగురవేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. డీఎంకే- 59, ఏఐఏడీఎంకే- 47, కాంగ్రెస్- 5, పీఎంకే- 4 సీట్లు స్థానాలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచారు విజయ్. కాంగ్రెస్ మద్దతును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో టీవీకేకు మద్దతు ఇవ్వడానికి ఏఐఏడీఎంకే సైతం ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చర్చలు జరుపుతున్నారని ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే లీమారోస్ మార్టిన్ వెల్లడించారు. రాష్టంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము ముందుకు వచ్చామని, ఆ దిశగానే ఈ చర్చలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.

లాల్గుడిలో మంగళవారం రాత్రి లీమా రోజ్ మార్టిన్ విలేకరులతో మాట్లాడారు. విజయ్- పళణిస్వామి మధ్య చర్చలు జరుగుతున్నాయని, అవి ఫలప్రదమౌతాయని పేర్కొన్నారు. టీవీకేకు బయటి నుంచి మద్దతు ఇవ్వవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ వెల్లడించింది. ఎటువంటి పదవులు ఆశించకుండా, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ చర్చలు సాగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై ఆమె ఎటువంటి అదనపు వివరాలను అందించలేదు.
లాటరీ బారూన్ శాంటియాగో మార్టిన్ భార్య అయిన లీమారోస్ మార్టిన్.. తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్గుడి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందారు. టీవీకే ప్రధాన కార్యదర్శి, విల్లివాక్కం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఆధవ్ అర్జున.. స్వయానా ఆమె అల్లుడే. ఏఐఏడీఎంకే ద్వారా బయటి నుంచి మద్దతు పొందితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయం అటు టీవీకేలో కూడా ఉందని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందని చెబుతున్నారు.
Chennai, Tamil Nadu: AIADMK MLA-elect Leema Rose Martin says, "Talks are currently underway with AIADMK General Secretary Edappadi K. Palaniswami from the TVK side." pic.twitter.com/kcLajIYpM4
— ANI (@ANI) May 5, 2026
డీఎండీకే నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే ప్రేమలత విజయ్ కాంత్ ఇప్పటికే విజయ్ కు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్ కూడా ముందుకు వచ్చింది. ఆ పార్టీ నుంచి అయిదుమంది అభ్యర్థులు గెలిచారు. ఈ సంఖ్య కూడా చాలదు. దీంతో విజయ్ ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications