సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మంచు లక్ష్మీ వీడియో.. ఫుల్ ట్రెండింగ్ !!

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. కేవలం నటిగానే కాకుండా.. నిర్మాతగా, గాయనిగా, వ్యాఖ్యాతగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సినీరంగంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆమె.. ప్రస్తుతం ముంబైకి మకాం మార్చారు. అయితే లక్ష్మి తన నటనా జీవితాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ వేదికపైనే ప్రారంభించారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

లక్ష్మీ టాలీవుడ్‌లో అడుగుపెట్టకముందే అమెరికాలో నటిగా తన ముద్ర వేశారు. ప్రసిద్ధ అమెరికన్ టీవీ సిరీస్ 'Las Vegas'లో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన 'Desperate Housewives', 'Mystery ER' వంటి పాపులర్ షోలలో నటించి మెప్పించారు. అలానే వెండితెరపై కూడా 'The Ode', 'Dead Air' వంటి ఇంగ్లీష్ చిత్రాల్లో నటించి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, లాస్ ఏంజిల్స్‌లో ఉన్నప్పుడే కొన్ని లఘు చిత్రాలకు దర్శకత్వం వహించి తనలోని టాలెంట్ నిరూపించుకున్నారు.

manchu-lakshmi-hollywood-movie-video-goes-trending-on-social-media-and-netizens-reactions

అయితే ప్రస్తుతం మంచు లక్ష్మీకి సంబంధించి ఒక సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. హాలీవుడ్ లో ఆమె నటించిన ఒక సన్నివేశం ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ గా మారింది. నెటిజన్లు సైతం ఈవిడ మన మంచు లక్ష్మినా అంటూ షాక్ అవుతూ కామెంట్స్ కురిపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.

కాగా మంచు లక్ష్మి తెలుగు చిత్ర పరిశ్రమలోకి సిద్ధార్థ్ హీరోగా వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తన తొలి చిత్రంతోనే నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి' సినిమాలో ఆమె చేసిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. 'చందమామ కథలు', 'దొంగాట', 'లక్ష్మి బాంబ్' వంటి చిత్రాలు ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.

ఇక నటిగానే కాకుండా టెలివిజన్ హోస్ట్‌గా మంచు లక్ష్మి సాధించిన పాపులారిటీ అమోఘం. 'మంచు లక్ష్మి' అనగానే ప్రేక్షకులు ఆమెను తమ ఇంటి మనిషిగా భావించేలా చేసినవి ఆమె టాక్ షోలే. 'ప్రేమతో మీ లక్ష్మి', 'లక్ష్మి టాక్ షో', 'మెమోరీస్ విత్ రాఘవేంద్రరావు' వంటి కార్యక్రమాలు బుల్లితెరపై సంచలనం సృష్టించాయి. సెలబ్రిటీలతో ఆమె చేసే సంభాషణలు, ఆమె మాట్లాడే శైలి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మరోవైపు నటన, హోస్టింగ్ మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలోనూ మంచు లక్ష్మి తన సత్తా చాటారు. 'లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' బ్యానర్‌పై నాణ్యమైన మరియు వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆమె వ్యక్తిత్వంలోని మరో కోణం 'సామాజిక సేవ'. తన సొంత స్వచ్ఛంద సంస్థ 'Teach for Change' ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. విద్యారంగంలో మార్పు కోసం ఆమె చేస్తున్న కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+