మోదీ పాదాభివందనం చేస్తున్న పెద్దాయన ఎవరో తెలుసా..!?

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ.. షా సహా ఎన్డీఏ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మమతా ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రమాణ స్వీకార వేదిక మీదకు రాగానే ప్రధాని మోదీ అక్కడే ఉన్న ఒక పెద్దాయన వద్దకు ప్రత్యేకంగా వెళ్లారు. పాదాభివందనం చేసారు. ఆలింగనం చేసుకున్నారు. అయితే.. అసలు ఎవరీ పెద్దాయన.. ఎందుకు మోదీ ఆయనకు పాదాభివందనం చేసారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. అయితే, ఆ పెద్దాయనకు బీజేపీలో ఓ ప్రత్యేకత ఉంది.

బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరే వేళ ఆసక్తి కర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసారు. ఈ వేదిక మీదకు రాగానే ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదిక పైన ఉన్న ఒక పెద్దాయన వద్దకు మోదీ వెళ్లి అభివాదం చేసారు. తొలుత సత్కారించి.. ఆయనకు పాదాభివందనంతో ప్రత్యేకంగా గౌరవించారు. ఆ పెద్దాయనే 98 ఏళ్ల వృద్ధ బీజేపీ కార్యకర్త మఖన్‌లాల్ సర్కార్‌.

PM Modi took blessings and felicitated Makhanlal Sarkar one of the most senior BJP workers in West Bengal

ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆయనను సన్మానించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్రంలోని అత్యంత తొలితరం క్షేత్రస్థాయి నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందిన సర్కార్, జాతీయవాద ఉద్యమ చరిత్ర కలిగిన ఒక కీలకమైన, దీర్ఘకాలిక సభ్యుడిగా సేవలందించారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి వెళ్ళి, కాశ్మీర్‌లో అరెస్టు అయ్యారు. 1980లో బీజేపీ ఆవిర్భవించిన తర్వాత, ఆయన పశ్చిమ దినాజ్‌పూర్, జల్‌పైగురి మరియు డార్జిలింగ్‌తో సహా ఉత్తర బెంగాల్ జిల్లాలకు సంస్థాగత సమన్వయకర్తగా పనిచేశారు.

ఇప్పుడు మోదీ పాదాభివందనంతో మఖన్‌లాల్ సర్కార్ గురించిన కీలక అంశాలు తెర మీదకు వచ్చాయి. 1952లో, భారత జెండాను ఎగురవేసే ఉద్యమంలో భాగంగా ఆయన శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి వెళ్ళి, కాశ్మీర్‌లో అరెస్టు అయ్యారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే 10,000 మంది సభ్యులను బీజేపీలో చేర్పించారు.1981 నుండి వరుసగా ఏడు సంవత్సరాల పాటు ఆయన జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. పశ్చిమ బెంగాల్‌లో మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన సందర్భంలో ప్రధాని మోదీ ఆయన చేసిన సేవలకు గుర్తింపు ఇస్తూ ప్రత్యేకంగా అభినందించి.. సత్కరించారు. బెంగాల్ లో తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు వేళ ఈ అరుదైన గుర్తింపు దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+