పొత్తు కావాలంటే AIADMK కు విజయ్ కండీషన్స్, అలా అయితే సిద్దం..!!
తమిళనాట విజయ్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే విజయ్ కింగ్.. లేదంటే హంగ్ అన్నట్లుగా ఫలితాల సరళి కనిపిస్తోంది. సంప్రదాయ పార్టీలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. విజయ్ కు పట్టం కడుతున్నారు. ఫలితాల్లో అనూహ్యంగా టీవీకే పార్టీ దూసుకు వెళ్తోంది. అధికారం ఖాయమని భావించిన డీఎంకే మూడో స్థానంలో కొనసాగుతోంది. అన్నా డీఎంకే కూటమి రెండో స్థానంలో నిలిచింది. విజయ్ ను తమ వైపు తిప్పుకొని డీఎంకేకు అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో అన్నా డీఎంకే అప్పుడే రంగంలోకి దిగింది. అయితే, విజయ్ నో అని చెప్పకుండా కొత్త కండీషన్లు మధ్య వర్తుల ద్వారా తెర మీదకు తీసుకురావటం సంచలనంగా మారుతోంది.
తమిళనాడు లో లెక్కలు తారు మారు అవుతున్నాయి. విజయ్ కింగ్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 110 స్థానాలో టీవీకే ఏకపక్షంగా దూసుకెళ్తోంది. డీఎంకే దూకుడుకు ఈవీఎం లు ఓపెన్ చేసిన సమయం నుంచి విజయ్ బ్రేకులు వేసారు. అన్నా డీఎంకే కూటమి రెండో స్థానంలో కొనసాగుతోంది. డీఎంకే 53, అన్నా డీఎంకే కూటమి 71 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో.. విజయ్ కింగ్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ కు కింగ్ గా మారే అవకాశం లేకపోతే.. హంగ్ తప్పదనేది స్పష్టం అవుతోంది. దీంతో.. అన్నా డీఎంకే ముఖ్య నేతలు అప్పుడే మంత్రాంగం ప్రారంభించారు. హంగ్ వస్తే విజయ్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నారు. ఫలితాల పైన మరింత స్పష్టత వచ్చిన తరువాత నిర్ణయం ప్రకటించేందు కు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అయితే, టీవీకే మాత్రం తమకు ఎవరి మద్దతు అవసరం లేకుండా తామే సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది.

హంగ్ రాదు.. తమదే అధికారం అంటున్న విజయ్
దీంతో, మధ్య వర్తులు రంగంలోకి దిగారు. ఒక వేళ అధికారానికి కావాల్సిన నెంబర్ కు దూరంగా ఉంటే.. ఛాన్స్ వదులుకోవద్దని విజయ్ కు సూచిస్తున్నారు. దీంతో.. అన్నా డీఎంకే కు కొత్త కండీషన్ విధించినట్లు తెలుస్తోంది. బీజేపీతో సంబంధం లేకుండా ముందుకు వస్తే పొత్తు పైన ఆలోచన చేసేందుకు.. అది కూడా ఫలితాల తరువాత మాత్రమే చర్చలు చేద్దామని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. సింగిల్ గా పోటీ చేసిన తాను.. సింగిల్ గానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని విజయ్ ధీమగా ఉన్నారు. అటు విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆధిక్యతలో ఉన్నారు చెన్నై పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలో విజిల్ మోత మోగుతోంది. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వెనుకజంలో కొనసాగుతున్నారు. అయితే.. ఇంకా పలు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. ఇదే ఊపు కొనసాగితే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఫలితాలను డీఎంకే నేతలకు అంతు చిక్కటం లేదు. విజయ్ సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా.. పొత్తు అవసరం అవుతుందా అనేది మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications