విజయ్ ‘మహా’ విజయ్: 50 ఏళ్ల తర్వాత ఎంజీఆర్ మ్యాజిక్ రిపీట్ !

తమిళనాడు రాజకీయాల్లో ఓ సరికొత్త శకం మొదలైంది. 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' పార్టీ ఏకంగా 100కు పైగా స్థానాల్లో దూసుకెళ్లి ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐడీఎంకే ద్విధ్రువ రాజకీయాలకు విజయ్ గట్టి చెక్ పెట్టారు. ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా ఓ 'ఒంటరి సింహం'లా బరిలోకి దిగి ఈ స్థాయిలో సీట్లు గెలవడం భారత రాజకీయాల్లోనే ఓ అద్భుతంగా పరిగణించబడుతోంది. ఈ విజయం సుమారు 50 ఏళ్ల క్రితం ఎం.జి.రామచంద్రన్ (ఎంజీఆర్) సృష్టించిన ప్రభంజనాన్ని గుర్తు చేస్తోంది.

ఎంజీఆర్, ఎన్టీఆర్.. ఇప్పుడు విజయ్
సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తొలి ప్రయత్నంలోనే అధికారానికి చేరువైన నటులలో ఎంజీఆర్, ఎన్టీఆర్ అగ్రస్థానంలో ఉంటారు. 1972లో డీఎంకే నుంచి బయటకు వచ్చి ఏఐడీఎంకే స్థాపించిన ఎంజీఆర్.. 1977లో తొలి ఎన్నికల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ 1983లో కేవలం 9 నెలల కాలంలోనే కాంగ్రెస్‌ను ఓడించి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు విజయ్ కూడా అదే తరహాలో తన 'మాస్ ఇమేజ్'ను ఓట్లుగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. విజయ్ సాధించిన ఈ ఘనత.. గతంలో చిరంజీవి (18 సీట్లు), పవన్ కళ్యాణ్ (తొలి ఎన్నికల్లో 1 సీటు), కమల్ హాసన్ (0 సీట్లు) వంటి హేమాహేమీలు సాధించలేని అరుదైన రికార్డు.

Thalapathy Vijay Political Tsunami TVK Wins 100 Seats Echoes MGR Era in Tamil Nadu Details

రక్షకుడి ఇమేజ్ సంపాదించుకున్న విజయ్
దళపతి విజయ్ విజయం వెనుక ఓ పక్కా వ్యూహం కనిపిస్తోంది. కమల్ హాసన్ లాంటి వారు 'మేధావుల రాజకీయాల'కు పరిమితం కాగా.. విజయ్ మాత్రం ఎంజీఆర్ తరహాలో సామాన్య ప్రజానీకాన్ని, ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకున్నారు. తన సినిమాల్లోని 'రక్షకుడి' ఇమేజ్‌ను రాజకీయాల్లోకి సమర్థవంతంగా తీసుకువచ్చారు. దశాబ్దాలుగా పాత పార్టీల పాలనతో విసిగిపోయిన తమిళ ఓటర్లు విజయ్ రూపంలో ఓ కొత్త ప్రత్యామ్నాయాన్ని చూశారు.

శివాజీ గణేషన్ వంటి నటులు సినిమాల్లో దిగ్గజాలైనప్పటికీ రాజకీయాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. విజయకాంత్ ఒకప్పుడు కింగ్ మేకర్‌గా ఎదిగినా సొంతంగా అధికారం చేపట్టలేకపోయారు. కానీ విజయ్ ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి నేరుగా 100 సీట్లు సాధించడం తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసింది. పాత పార్టీల పునాదులను కదిలిస్తూ, దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాట ఒక బలమైన పవర్ సెంటర్‌గా అవతరించారు. సినిమా బాక్సాఫీస్ వద్దే కాదు, ఈవీఎంల వద్ద కూడా తన మ్యాజిక్ పనిచేస్తుందని విజయ్ నిరూపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+