ఒక్క చుక్క కూడా నూనె లేకుండా వంటలు చెయ్యండి.. సూపర్ బహుమతులు గెలుచుకోండి!

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నూనె వాడకాన్ని తగ్గించాలని, ఊబకాయం మరియు సంబంధిత వ్యాధులను అరికట్టాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపును అమలు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు myGov సంయుక్తంగా ఒక ఛాలెంజ్‌ను తీసుకొచ్చాయి. భారతదేశంలో నూనె వాడకాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన వంటల వైపు ప్రజలను మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన కాంటెస్ట్‌ను ప్రారంభించింది.

ఆయిల్ ఫ్రీ కుకింగ్ ఛాలెంజ్ ఫర్ ఎ హెల్తియర్ ఇండియా

"డ్రాప్ ది ఆయిల్ ఛాలెంజ్ - ఆయిల్ ఫ్రీ కుకింగ్ ఛాలెంజ్ ఫర్ ఎ హెల్తియర్ ఇండియా" పేరుతో myGov ప్లాట్‌ఫామ్‌లో ఈ కాంటెస్ట్ నడుస్తోంది.నూనె లేకుండా రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు తయారు చేసి ప్రజలను ప్రోత్సహించడమే ఈ పోటీ లక్ష్యం. ఈ పోటీలో 18 ఏళ్లు పైబడిన భారతీయులందరూ పాల్గొనవచ్చు. ఒక్క వ్యక్తికి ఒక్క రెసిపీ మాత్రమే చెయ్యాల్సి ఉంటుంది. పోటీ గడువు: జూన్ 5, 2026 వరకు మాత్రమే.

Drop the Oil Challenge Oil-Free Cooking Contest to promote healthy eating across India by myGov

ఎలాంటి వంటకాలు సమర్పించాలి?

పూర్తిగా నూనె లేని (ఆయిల్ ఫ్రీ) వంటకాలు ఈ పోటీలో చెయ్యాల్సి ఉంటుంది. మీ సొంత క్రియేటివ్ రెసిపీ అయి ఉండాలి. సాధారణ ఇండియన్ వంటకాలను నూనె లేకుండా తయారు చేసి చూపించవచ్చు. ఈ పోటీలో పాల్గొనేవారు ఇవ్వాల్సిన వంట వివరాలు ఈ విధంగా ఉండాలి. వంటకం పేరు, కావాల్సిన పదార్థాలు,స్టెప్ బై స్టెప్ వంట విధానం, వంట సమయం, ఎంత మందికి సరిపోతుంది, ఆరోగ్య ప్రయోజనాలు, 2-3 ఫైనల్ ఫోటోలు (JPEG ఫార్మాట్‌లో) పంపించాల్సి ఉంటుంది.

ఈ ఛాలెంజ్ లో బహుమతులు, అనేక ప్రయోజనాలు

ఉత్తమ 50 వంటకాలకు FSSAI గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వబడతాయి. ఈ పోటీలలో పాల్గొనే అందరికీ ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి.ఈ ఛాలెంజ్ ద్వారా కేవలం బహుమతులు గెల్చడం మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, నూనె వాడకం తగ్గించి ఆర్థిక ఆదా చేయడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన భారతదేశం లక్ష్యంగా ప్రారంభమైన ఈ పోటీలో మీరు కూడా పాల్గొని మీ వంట ప్రతిభను ప్రదర్శించండి.

విశాఖ నగరానికి మరో ఐటీ దిగ్గజం.. జాబ్స్ కోసం గెట్ రెడీ!
విశాఖ నగరానికి మరో ఐటీ దిగ్గజం.. జాబ్స్ కోసం గెట్ రెడీ!

myGov వెబ్‌సైట్‌లో Drop the Oil Challenge

ఈ పోటీలలో పాల్గొనాలి అనుకునేవారు myGov వెబ్‌సైట్‌లో లాగిన్ చేయండి. "Get Involved" → "Do/Task" సెక్షన్‌లోకి వెళ్లండి ఆపై "Drop the Oil Challenge" సెలెక్ట్ చేసి రెసిపీ అప్‌లోడ్ చేయండి. అంతే మీరు ఈ కాంటెస్ట్ లో భాగం అవుతారు. మరెందుకు ఆలస్యం.. ఈ కాంటెస్ట్ లో మీ వంట చేసి ఆరోగ్యకరమైన జీవితానికి ఆయిల్ లేని ఆహారాన్ని అందించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+