వరంగల్ ప్రాంతీయ ప్రభుత్వ నేత్ర వైద్య ఆసుపత్రికి మహర్దశ

ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేసి కంటి చికిత్సలు చేయించుకోలేని పేదలు, మధ్య తరగతి ప్రజలకు వర ప్రదాయినిగా మారిన వరంగల్ రీజినల్ ఐ హాస్పిటల్ పై శుభవార్త. వరంగల్ ను వైద్య,ఆరోగ్య రంగంలో ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమంలో మరో ముందడుగు పడింది. ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య ఆసుపత్రిని అత్యాధునిక స్థాయికి తీర్చిదిద్దే దిశగా మరో ముఖ్యమైన అడుగులు పడుతున్నాయి.

వరంగల్ రీజినల్ ఐ హాస్పిటల్‌ అభివృద్ధికి ప్రణాళికలు

ఈ మేరకు కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వరంగల్ రీజినల్ ఐ హాస్పిటల్‌ అభివృద్ధికి ప్రస్తుతం 75 పడకలున్న ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యానికి విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. కార్నియా, గ్లకోమా, రెటినా, స్క్వింట్ విభాగాల్లో యూనిట్లను 4 నుంచి 6కి పెంచాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ ద్వారా రూ. 1.73 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

Warangal Regional Eye Hospital is going to develop the health services with some key decisions

కంటి చికిత్సకు ఉత్తమ కేంద్రంగా అభివృద్ధి

భద్రత, పారిశుధ్యం మరియు పేషెంట్ కేర్ సిబ్బందిని 32 నుంచి 62 మందికి పెంచాలని నిర్ణయించారు. ఖాళీ టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చెయ్యాలని నిర్ణయించారు. కంటి ఆస్పత్రిని అన్ని విధాలా బలోపేతం చేసి, వరంగల్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు కంటి చికిత్సకు ఉత్తమ కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

పేదలు-మధ్యతరగతి ప్రజలకు ఉన్నతస్థాయి వైద్య సేవలు

ఈ అభివృద్ధి పనులు పూర్తి అయితే వరంగల్ ప్రాంతంలో కంటి వైద్యం రంగం మరింత బలపడి, పేదలు-మధ్యతరగతి ప్రజలు ఉన్నత స్థాయి వైద్య సేవలను సమీపంలోనే పొందేందుకు అవకాశం ఏర్పడనుంది. ఇప్పటికే వరంగల్ రీజినల్ కంటి ఆస్పత్రిలో ప్రతిరోజు సగటున 350 నుంచి 400 మంది వరకు ఔట్ పేషెంట్లు నమోదవుతున్నారు. రోజుకు సగటున 30 మందికి సర్జరీలు జరుగుతున్నాయి.

 బండి భగీరథ్ పోక్సో కేసుతో పాటు కొత్త పార్టీపై నోరువిప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్
బండి భగీరథ్ పోక్సో కేసుతో పాటు కొత్త పార్టీపై నోరువిప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్

ఈ ప్రాంతాల నుండి రోగులు

గత సంవత్సరం మొత్తం 7,212 సర్జరీలు నిర్వహించగా, ఈ సంవత్సరం ఇప్పటికే 2,000 మందికి పైగా కంటి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. కాటరాక్ట్, రెటినా సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువ సంఖ్యలో కంటి చికిత్సల కోసం వస్తున్నారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్‌తో పాటు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా రోగులు వస్తున్నారు. ఇప్పుడు ఈ ఆస్పత్రి అభివృద్ధి జరిగితే మరింత మందికి వైద్య సేవలు అందుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+