'పెద్ది' క్లైమాక్స్ రివీల్..? 'ఉప్పెన' క్లైమాక్స్ కంటే 100 రెట్లు షాకింగ్..!

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'పెద్ది'.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. పెద్ది ట్రైలర్ కేవలం యూట్యూబ్ లోనే కాకుండా ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇక పెద్ది చిత్రానికి సంబంధించిన మూడో సాంగ్ మాస్ బీట్ అని సమాచారం. ఈ నెల 23న ఈ సాంగ్ ను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. భోపాల్ లో ఒక మ్యూజికల్ నైట్ ను నిర్వహించి.. AR రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ ద్వారా ఈ సాంగ్ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.

అయితే దర్శకుడు బుచ్చిబాబు సానా సినిమాల్లో ఎమోషన్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆయన తొలి సినిమా ఉప్పెన ఓ సంచలనం.. ఆ సినిమా క్లైమాక్స్ ను ఎవరూ మర్చిపోరు. ప్రేమకి, దైవత్వానికి అంగవైకల్యం ఉండదు అనే ఎండ్ కార్డ్ తో సినిమా ముగుస్తుంది. అయితే ఉప్పెన క్లైమాక్స్ తర్వాత ఇప్పుడు పెద్ది క్లైమాక్స్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పెద్ది సినిమాలో చివరి 40 నిమిషాలు చాలా ప్రత్యేకం అని అందులో రామ్ చరణ్ ను అందరూ మర్చిపోతారని పెద్ది క్యారెక్టర్ నే గుర్తుపెట్టుకుంటారని దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే చెప్పారు. అయితే పెద్ది సినిమాలో సెకండాఫ్ లో వచ్చే ఆ దిల్లీ ఎపిసోడ్.. ఉప్పెన క్లైమాక్స్ కంటే 100 రెట్లు షాకింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

దిల్లీ ఎపిసోడ్ సినిమాకే కీలకంగా మారనున్నట్లు సమాచారం. దిల్లీ ఎపిసోడ్ లో వచ్చే ఈ బిగ్గెస్ట్ ట్విస్ అసలు ఎలా రాశావు బుచ్చి అంటూ రామ్ చరణ్ ఇప్పటికే బుచ్చిబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. మరి ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. ఇక తాజాగా పెద్ది సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా రన్ టైన్ 3 గంటల 4 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ని జారీ చేశారు. పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 2 న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు సమాచారం.

Peddi Climax Shock Delhi Episode Set to Be 100 Times More Explosive Than Uppena Climax Peddi

ఇక పెద్ది మూవీలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించింది. ఈ సినిమాలో సీనియర్ నటులు జగపతిబాబు, శివకుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఏ ఆర్ రెహామాన్ సంగీతం అందించారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్​ పై సతీశ్ కిలారు నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+