సినిమా విడుదలైన తర్వాత మొదటి వారం ఫ్లాప్.. రెండో వారం ఇండస్ట్రీ హిట్

తెలుగు సినిమా చరిత్రలో విడుదలైన మొదటి రోజు లేదా మొదటి వారం ఫ్లాప్ టాక్ తెచ్చుకుని, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తూ "ఇండస్ట్రీ హిట్" గా నిలిచిన అద్భుతం 'పోకిరి'. మహేష్ బాబు హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. మొదటి వారం 'ఫ్లాప్ టాక్' ఎందుకు వచ్చింది అంటే అంతకుముందు మహేష్ బాబు 'అతడు' వంటి క్లాస్, సాఫ్ట్ యాక్షన్ హిట్ తర్వాత నటించిన సినిమా ఇది.

అప్పటివరకు తెలుగు తెరపై చూడని ఒక రా అండ్ రస్టిక్ అంటే.. రౌడీయిజం, ముఠా ముఠాల కొట్లాటల వాతావరణంలో పూరీ జగన్నాథ్ ఈ సినిమాను చూపించారు. సినిమాలో హీరో మాట్లాడే బూతులతో కూడిన రఫ్ లాంగ్వేజ్, విపరీతమైన వయలెన్స్ చూసి మొదటి రోజు క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీస్ కాస్త షాక్‌కు గురయ్యారు. దాంతో మొదటి వారం "ఇదేం సినిమా.. మహేష్ బాబు ఇలాంటి క్యారెక్టర్ చేశాడు ఏంటి? సినిమా ఫ్లాప్" అనే టాక్ నడిచింది. అలా వారం రోజులు అదే టాక్ నడించింది.

Pokiri the film was declared a flop in the first week but went on to become an industry hit in the second week

రిపీట్ ఆడియన్స్ పెరిగారు

మొదటి వారం నెగిటివ్ టాక్ నడిచినా.. సెకండ్ వీక్ నుంచి సినిమా రేంజ్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ థియేటర్లలో ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేసింది. మాస్ ఆడియన్స్‌కు మహేష్ బాబు మేనరిజం, "ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా!", "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" వంటి డైలాగ్స్ విపరీతంగా ఎక్కేసాయి. మణిశర్మ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లాయి. దాంతో రిపీట్ ఆడియన్స్ పెరిగి, ఫ్యామిలీలు కూడా క్యూ కట్టడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి, అప్పటివరకు ఉన్న 'ఇంద్ర' సినిమా రికార్డులను బద్దలు కొట్టి ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

75ఏళ్ల రికార్డులన్నీ బద్దలు

మహేష్ బాబు, ఇలియానా, ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, బ్రహ్మానందం తదితరులు నటించారు. తెలుగు సినిమా పరిశ్రమ 75 ఏళ్ల మైలురాయిని చేరుకున్న తరుణంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఏకంగా 200 పైగా థియేటర్లలో 100 రోజులు, 63 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. ఒక థియేటర్లో (కర్నూలులో) ఏకంగా 500 రోజులు ప్రదర్శితమై సంచలనం సృష్టించింది. ఈ సినిమాతోనే మహేష్ బాబు టాలీవుడ్‌లో తిరుగులేని "సూపర్ స్టార్" స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ వల్ల దీనిని తమిళ్‌లో విజయ్‌తో 'పోక్కిరి'గా, హిందీలో సల్మాన్ ఖాన్‌తో 'వాంటెడ్' గా, కన్నడలో దర్శన్‌తో 'పోర్కి'గా రీమేక్ చేయగా.. అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+