TMC ఓటమి.. డ్యాన్స్ వేసిన పోలీసులు: వైరల్ వీడియో

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించిన తర్వాత.. రాష్ట్ర పోలీసు అధికారులు జరుపుకున్న సంబరాల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సోమవారం బీజేపీ మెజారిటీ సాధించాక పోలీసులు డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

ఈ వైరల్ వీడియోలో పోలీసులు ఒక పోలీస్ స్టేషన్ వెలుపల 'జై శ్రీరామ్', 'హర్ హర్ మహాదేవ్' అంటూ నినాదాలు చేశారు. దీన్ని పంచుకుంటూ బీజేపీ నాయకుడు తేజిందర్ బగ్గా: "టీఎంసీ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత పశ్చిమ బెంగాల్ పోలీసులు నృత్యం చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.

మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ వారి పరాజయాన్ని స్పష్టం చేశాయి.బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా తమ విజయాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. పశ్చిమ బెంగాల్ సంప్రదాయ రుచులైన ఝాల్‌మురి, రసగుల్లాలను ఆస్వాదించారు. ప్రధాని మోడీ ఒక దుకాణం వద్ద కాన్వాయ్‌ను ఆపి ఝాల్‌మురి తీసుకున్నారు.

TMC Defeat Viral Video of Police Dancing in Celebration Goes Viral Across Social Media TMC defeat

తాజా ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ ఇప్పటికే 148 సీట్ల మెజారిటీ మార్కును అధిగమించింది. 186 సీట్లు గెలిచి, మరో 21 స్థానాల్లో ఆధిక్యంతో మొత్తం 200 సీట్లకు పైగా చేరుకుంది. అయితే, టీఎంసీ కేవలం 64 సీట్లు గెలిచి, మరో 16 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచి, మొత్తంగా 80 సీట్లకు పరిమితమైంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక తుది ఫలితాలు వెలువడతాయి. 15 ఏళ్ల పాటు బెంగాల్ లో చక్రం తిప్పిన టీఎంసీ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద షాకే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు కారణంగానే బెంగాల్ ప్రజలు ఈ తీర్పు ఇచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+