టీవీకే చీఫ్ విజయ్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?

తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయంతో Vijay పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో Tamilaga Vettri Kazhagam (TVK) దూసుకెళ్లడంతో.. విజయ్ రాజకీయంగా కొత్త అధ్యాయం ప్రారంభించినట్టే కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఇంత తక్కువ సమయంలోనే ఈ స్థాయి విజయాన్ని సాధించడం నిజంగా విశేషమని విశ్లేషకులు చెబుతున్నారు.

విజయ్ చెల్లి ఎలా చనిపోయారంటే..

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే విజయ్‌కు ఒక చెల్లెలు ఉండేది. ఆమె పేరు 'విద్య'. 1980లో జన్మించిన విద్య, కేవలం నాలుగేళ్ల వయసులోనే 1984 మే 20న అనారోగ్యంతో మరణించింది. ఈ సంఘటన విజయ్ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. చిన్నప్పటి నుంచి చెల్లెలుతో ఎంతో అనుబంధం కలిగిన విజయ్, స్కూల్ నుంచి వచ్చాక ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేవాడని కుటుంబ సభ్యులు చెబుతారు. ఆమెను స్నానం చేయించడం, తినిపించడం వరకు చూసుకునేవాడట.

tvk-chief-vijay-sister-and-her-death-details-makes-every-one-emotional-and-support-to-him

అలాంటి చెల్లెలు అకస్మాత్తుగా దూరమవడంతో విజయ్ తీవ్ర మనోవేదనకు గురై, కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని ఆయన తల్లి ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ జ్ఞాపకాన్ని నిలుపుకోవడానికి తన కూతురికి 'దివ్య' అనే పేరు పెట్టడం, అలాగే తన ప్రొడక్షన్ హౌస్‌కు 'విద్యా-విజయ్ ప్రొడక్షన్స్' అని పేరు పెట్టడం ఆయన చెల్లెలుపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా భావిస్తున్నారు.

ఎన్నికల్లో టీవీకే సంచలనం..

కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో TVK పార్టీ అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 234 స్థానాల్లో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద శక్తిగా అవతరించింది. ఈ ఫలితాలు దశాబ్దాలుగా కొనసాగుతున్న DMK - AIADMK రాజకీయ ఆధిపత్యానికి పెద్ద షాక్‌గా మారాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 మెజారిటీకి ఇంకా 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ఇతర పార్టీల మద్దతు కోసం చర్చలు ప్రారంభించారు. ముఖ్యంగా కాంగ్రెస్ (5 సీట్లు), సీపీఎం, సీపీఐ, వీసీకే వంటి పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

అదే సమయంలో Premalatha Vijayakanth ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించడం కీలక పరిణామంగా మారింది. పీఎంకే వంటి పార్టీలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యను త్వరలోనే సాధిస్తారని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి M. K. Stalin తన పదవికి రాజీనామా చేయగా గవర్నర్ ఆ రాజీనామాను ఆమోదించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

tvk-chief-vijay-sister-and-her-death-details-makes-every-one-emotional-and-support-to-him

మరోవైపు అన్ని రాజకీయ సమీకరణలు సజావుగా జరిగితే, ఈ నెల 7న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పాటు సుమారు 9 మంది క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+