ఓటీటీలోకి ప్యూర్ హర్రర్ సినిమా.. గుండె ధైర్యం ఉంటేనే చూడండి భయ్యా..!

హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ ఏ జానర్ లో ఉన్నా చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎగబడుతుంటారు. ఓటీటీల పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలోని ఏ మూలన ఉన్న సినిమా అయినా సబ్ టైటిల్స్ పెట్టుకుని చూసే అవకాశం ఉంది. అయితే ఇటీవల థియేటర్లలో విడుదలై రచ్చ రచ్చ చేసిన ఓ హాలీవుడ్ హార్రర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ మూవీనే ' లీ క్రోనిన్ ద మమ్మీ'.. మమ్మీ మూవీ సిరీస్ మీద ఇప్పటి వరకూ చాలా సినిమాలే వచ్చాయి.

అవన్నీ 90' స్ కిడ్స్ కు బాగా నచ్చాయి. అయితే ఈ మూవీ మమ్మీ సినిమాలకు పూర్తి భిన్నంగా ఒక సరికొత్త హర్రర్ రీబూట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త నెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ మూవీ హారర్ లవర్స్ ను విపరీతంగా మెప్పించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. త్వరలో భారత్ లో ఓటీటీలో రిలీజ్ కానుంది. అయితే ' లీ క్రోనిన్ ద మమ్మీ' మూవీ ఇప్పటికే విదేశాల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

LeeCronin Pure Horror Film The Mummy Now Streaming onOTT Watch This Terrifying Thriller Right Now

ఇక సాధారణంగా మమ్మీ సిరీస్ లోని మూవీస్ అంటే సాహసాలు, పురావస్తు శాస్త్రవేత్తల యాక్షన్, ఈజిప్ట్ పిరమిడ్ల చుట్టూ తిరిగే అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ 2026 వెర్షన్ వాటికి ఫుల్ స్టాప్ పెట్టి ప్యూర్ సూపర్ నేచురల్ హర్రర్ శైలిలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే..? ఓ జర్నలిస్టు కూతురు ఎడారిలో సడెన్ గా అదృశ్యం అవుతుంది. అయితే సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత ఆ చిన్నారి తిరిగి ఇంటికి వస్తుంది. అయితే కుటుంబ సభ్యులు సంతోషించే లోపే ఆ చిన్నారిలో భయంకరమైన మార్పులు మొదలవుతాయి. చిన్నారి క్రమేనా మమ్మీ రూపంలోకి మారడం.. ఆ కుటుంబ సభ్యులు ఎదుర్కునే భయానక పరిస్థితుల చుట్టూ కథ నడుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+