"విజయ్ అనే నేను"కి లైన్ క్లియర్ .. VCK నుంచి సపోర్ట్ లెటర్ వచ్చేసిందోచ్ !!
తమిళనాడులో టీవీకే అధినేత విజయ్‌కి వీసీకే పార్టీ మద్దతు ప్రకటించడంతో భారీ ఊరట లభించింది. వీసీకే తమ మద్దతు లేఖను టీవీకే పార్టీకి ఈమెయిల్ చేసినట్లు, అధికారిక 'ఎక్స్' హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలిచిన వీసీకే మద్దతుతో విజయ్ బలం 118కి చేరింది. ఇప్పటికే ఆయనకు కాంగ్రెస్, వామపక్షాల అండతో 116 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
కాగా ఇప్పటి వరకు మద్దతుపై నిర్ణయం తీసుకోని వీసీకే, డిమాండ్ల వల్ల వెనకడుగు వేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిసేపటికే మద్దతివ్వాలని నిర్ణయించి లేఖ పంపింది. తమ అధినేత, టీవీకే చీఫ్‌ల ఏఐ చిత్రాన్ని 'ఎక్స్'లో పంచుకున్నారు.

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, పూర్తి మెజారిటీకి ఇంకా 10 స్థానాలు తక్కువగా నిలిచింది. దీంతో కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం విజయ్ తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారు. మొదట టీవీకేకు మద్దతు ప్రకటించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అనూహ్యంగా వెనక్కి తగ్గినట్లు సమాచారం.
కానీ ఇప్పుడు వక్క మద్దతుతో 108 స్థానాలు మెజార్టీ ఉండడంతో విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications