వార్నీ.. గొంతు కోసుకున్న విజయ్ ఫ్యాన్

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ఆరంభమైంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదివరకే వెల్లడైన నేపథ్యంలో వీటిపైనే అందరి చూపూ నిలిచింది. ప్రారంభ ఫలితాలు ఉత్కంఠతకు గురి చేస్తోన్నాయి.

కొళత్తూరులో కూడా డీఎంకే భారీ ఆధిక్యత సాధించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోటీ చేశారిక్కడ. తన సమీప ప్రత్యర్థి సంతాన కృష్ణన్ పై తొలి రౌండ్ నుంచే లీడింగ్ కనబరిచారు. పలు జిల్లాల్లో డీఎంకే అభ్యర్థులు ఆధిక్యతలో ఉండగా.. టీవీకే వారికి గట్టి పోటీ ఇస్తోన్నట్టు కనిపిస్తోంది. ప్రారంభ ఫలితాల్లో డీఎంకే ఆధిక్యత సాధిస్తోండటంతో ఆ పార్టీ కార్యాలయం వద్ద సందడి మిన్నంటింది. కార్యకర్తలు, నాయకులు హర్షధ్వానాలు చేస్తోన్నారు.

Vijay Fan in Krishnagiri in Tamil Nadu Reportedly slits throat in distress counting rumors on TVK

కాగా ఈ పరిస్థితుల మధ్య కృష్ణగిరిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. విజయ్ వీరాభిమాని కే మహేంద్రన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎన్నికల్లో విజయ్ ఓడిపోతారని వదంతులు వ్యాపించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గొంతుకోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన జరిగింది. కృష్ణగిరిలో విజయ్ కు వీరాభిమానిగా పేరుంది మహేంద్రన్ కు. టీవీకే ప్రారంభమైనప్పటి నుంచీ ఆ పార్టీ తరఫున క్రియాశీలకంగా పని చేశాడు.

మహేంద్రన్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతన్ని కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. దీనిపై కృష్ణగిరి టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడారు. విజయ్ ఓడిపోతాడనే ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని, స్థానికులు అతన్ని కృష్ణగిరి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారని వివరించారు. డాక్టర్లు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+