సీఎంగా ప్రమాణస్వీకారం వేళ తీవ్ర శోకసంద్రంలో విజయ్..! వీడియో వైరల్

ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి టీవీకే అధినేత, దళపతి విజయ్ నివాళులు అర్పించారు. ఆర్‌బీ చౌదరి కుమారుడు జీవాను హత్తుకుని ఓదార్చారు. విజయ్ ను చూసిన జీవా ఒక్కసారిగా బోరున విలపించాడు. విజయ్ ను పట్టుకుని గుక్కపెట్టి జీవా ఏడ్చిన విధానం అక్కడ ఉన్నవారికి కన్నీళ్లు తెప్పించింది. అలాగే విజయ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్ కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఆర్‌బీ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు. ఓవైపు తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసి ఫుల్ జోష్ లో ఉన్న విజయ్ కు ఈ వార్త పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇక ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి విజయ్ నివాళులు అర్పించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇక విజయ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలకు ఆర్‌బీ చౌదరి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. దాంతో వీరిద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ గా ఏర్పడింది. విజయ్ కు పూవే ఉనక్కాగా, లవ్ టుడే, తుల్లాద మనముమ్ తుల్లుమ్, తిరుపాచ్చి, జిల్లా ఇలా ఏకంగా ఐదు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆర్‌బీ చౌదరి కి చెందిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ పై తెరకెక్కినవే. అందుకే ఆర్‌బీ చౌదరి భౌతిక కాయాన్ని చూడగానే విజయ్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆర్‌బీ చౌదరి మే 5 మంగళవారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆర్‌బీ చౌదరి పలు భాషల్లో 90 కు పైగా చిత్రాలు నిర్మించారు. ఆయన కెరీర్ మలయాళ చిత్రాలతోనే స్టార్ట్ చేశారు. అలా 1990 లో కుదువసంతంతో తమిళ ఇండస్ట్రీలో నిర్మాతగా రంగ ప్రవేశం చేశారు. తెలుగు లో ఈయన నిర్మించిన మొదటి చిత్రం సుస్వాగతం.. అలా తెలుగులో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

Vijay Pays Respect to Veteran Producer R B Choudary and Comforts His Son Jiiva Vijay R B Choudary

విక్టరీ వెంకటేష్ తో సూర్య వంశం, శీను చిత్రాలు తీశారు. ఆ తర్వాత నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. వీటితో పాటు ప్రియమైన నీకు, సింహరాశి, అదృష్టం, శివరామరాజు , లవ్ టుడే, సంక్రాంతి , అందాల రాముడు, అన్నవరం , గోరింటాకు, భీమిలి కబడ్డీ జట్టు, రచ్చ, మిస్టర్ పెళ్లి కొడుకు , గాడ్ ఫాదర్ వంటి తెలుగు చిత్రాలను నిర్మించారు. ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటుగా భావించవపచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+