సంచలన నిర్ణయం తీసుకుంటోన్న విజయ్..!!

తమిళనాడులో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ కూడా మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై పడింది. ఈ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ నూతన రాజకీయ శక్తిగా రంగప్రవేశం చేయడం దీనికి ప్రధాన కారణం. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చింది. గెలుపోటముల అంతర్యాన్ని తగ్గించడమే కాకుండా, ఫలితాలను తారుమారు చేయగలిగుతుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

అటు విజయ్ కు హైకోర్టులో కూడా భారీ ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయ్ ప్రకటించిన ఆస్తుల అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ తో విచారణ జరిపించాలని కోరుతూ తాజాగా దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఎస్ఏ ధర్మాధికారి, జీ అరుళ్ మురుగన్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. వివరణాత్మక ఉత్తర్వులను త్వరలో వెలువరిస్తామని తెలిపింది.

Vijay Receives a Sacred Darshan of Vishwaroopa Swami at Tiruchendur Murugan Temple TN Vote Count

ఈ పరిణామాల మధ్య విజయ్.. నేడు తమిళనాడులోని ప్రఖ్యాత తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. తూత్తుకూడి జిల్లాలో ఉంటుందీ ఆలయం. ఈ తెల్లవారు జామున చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరారు. తూత్తుకూడి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఆలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ తెల్లవారు జామున స్వామివారి విశ్వరూప దర్శన పూజలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట టీవీకే ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్, జగదీష్ బ్లిస్ సహా పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు. విజయ్ మెడలో మాల కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అది కరుంగళి మాలగా భావిస్తోన్నారు. కౌంటింగ్ సమయానికి విజయ్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సీట్ల సంఖ్య ఆధారంగా డీఎంకే, ఏఐఏడీఎంకేలకు బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

సుబ్రహ్మణ్య స్వామివారు వెలిసిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం.. తిరుచెందూర్. మురుగన్ గా పూజలందుకుంటోన్నారు ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వెలిసిన ఆరు ప్రముఖ దివ్య క్షేత్రాల్లో ఇదీ రెండవది. ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రజలు 'అరుపడై వీడు'గా పిలుస్తారు. యుద్ధంలో సూరపద్మను సంహరించిన సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే, తమ పనులలో విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+