విజయ్ 10 ఏళ్ల మాస్టర్ ప్లాన్ ? "టీవీకే" విజయానికి అసలు కారణం ఇదేనా..??

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు నటుడు విజయ్‌. ఒకప్పుడు కేవలం స్టార్ హీరోగా మాత్రమే గుర్తింపు పొందిన ఆయన.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చగల శక్తిగా ఎదిగారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అతి తక్కువ సమయంలోనే భారీ ప్రజాదరణ సంపాదించడంతో దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకుల దృష్టి తమిళనాడుపై పడింది.చాలా మంది దీన్ని "ఒక స్టార్ హీరో క్రేజ్"గా చూస్తున్నా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని విశ్లేషణలు మాత్రం ఇది దశాబ్దకాలంగా నిశ్శబ్దంగా నిర్మించిన రాజకీయ వ్యూహమని చెబుతున్నాయి.

ముఖ్యంగా విజయ్ సినిమాలు, ఆయన రాజకీయ ప్రయాణం మధ్య ఉన్న సంబంధాన్ని కొత్త కోణంలో చూపిస్తున్నాయి. విజయ్ ఒక్కసారిగా రాజకీయాల్లోకి రాలేదని.. ఆయన రాజకీయ ప్రచారం దశాబ్దం క్రితమే సినిమాల ద్వారా మొదలైంది" అనే వాదన ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఆ విషయాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

vijay-tamilaga-vettri-kazhagam-tvk-party-victory-in-elections-and-shocking-link-with-his-films-on

సినిమా తోనే రాజకీయ ప్రచారం?

2024లో టీవీకే పార్టీ అధికారికంగా ప్రారంభమైనప్పటికీ, విజయ్ ప్రజల్లో రాజకీయ నాయకుడిగా ఇమేజ్‌ను చాలా కాలం క్రితమే నిర్మించుకున్నారని సోషల్ మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన నటించిన అనేక సినిమాల్లో సామాజిక సమస్యలు, రాజకీయ అవినీతి, రైతుల కష్టాలు, కార్పొరేట్ దోపిడీ, ప్రజా హక్కులు వంటి అంశాలు ప్రధానంగా కనిపించాయి. ఈ సినిమాల్లో విజయ్ పాత్రలు కేవలం హీరోలుగా కాకుండా "వ్యవస్థను ప్రశ్నించే నాయకుడు"లా కనిపించాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెరపై చూపిస్తూ, వాటికి పరిష్కారం కోసం పోరాడే వ్యక్తిగా విజయ్ కనిపించడం వల్ల ప్రేక్షకుల్లో ఆయనపై ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం ఏర్పడిందని పోస్టులు విశ్లేషిస్తున్నాయి.

'కత్తి' నుంచి 'సర్కార్' వరకు..

అందులో భాగం గానే 2014లో విడుదలైన 'కత్తి' చిత్రం రైతుల సమస్యలు, నీటి వనరులపై కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం వంటి అంశాలను బలంగా ప్రస్తావించింది. రైతుల బాధలను ఎమోషనల్‌గా చూపించిన ఈ సినిమా గ్రామీణ వర్గాల్లో విజయ్‌కు మరింత చేరువ చేసింది. ఆ తర్వాత వచ్చిన 'మెర్సల్' ప్రైవేట్ హెల్త్‌కేర్ వ్యవస్థలో జరుగుతున్న దోపిడీపై తీవ్ర విమర్శలు చేసింది. జీఎస్టీ, వైద్య రంగం, పేదల పరిస్థితులపై వచ్చిన డైలాగులు అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

ఆ తర్వాత 2018లో విడుదలైన 'సర్కార్' చిత్రం ఎన్నికల అవకతవకలు, ఓటు హక్కు, సెక్షన్ 49పీ వంటి అంశాలను ప్రస్తావిస్తూ నేరుగా రాజకీయ వ్యవస్థను ప్రశ్నించింది. ఎన్నికల్లో ప్రజల పాత్ర ఎంత ముఖ్యమో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం జరిగింది. అలానే 'బిగిల్' సినిమాలో క్రీడారంగంలోని అవినీతి, మహిళా క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలు ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఇలా ప్రతి సినిమాలోనూ విజయ్ సామాజిక సమస్యలపై స్పందించే పాత్రల్లో కనిపించడం వల్ల ఆయనను ప్రజలు కేవలం నటుడిగా కాకుండా "ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తి"గా చూడటం మొదలుపెట్టారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కెరీర్ పీక్ స్టేజీలో ఎంట్రీ..

మరీ ముఖ్యంగా చాలా మంది సినీ నటులు తమ కెరీర్ ముగింపు దశలో రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ విజయ్ మాత్రం తన కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం పెద్ద సాహసంగా భావిస్తున్నారు. ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఉన్నప్పటికీ, ప్రజా జీవితాన్ని ఎంచుకోవడం ఆయనపై ప్రజల్లో గౌరవాన్ని పెంచిందని అభిమానులు చెబుతున్నారు. వీటికి తోడి విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు సహాయం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలకు అది కొత్తగా అనిపించలేదని భావిస్తున్నారు.

ఇక తమిళనాడులో దాదాపు 50 ఏళ్లుగా డీఎంకే-ఏఐఏడీఎంకే పార్టీలే ప్రధాన రాజకీయ శక్తులుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో యువతకు దగ్గరగా కనిపించే నాయకులు చాలా తక్కువ. అలాంటి సమయంలో విజయ్ తన స్టైల్, స్పీచ్, సినిమాల ద్వారా యువతను ఆకట్టుకున్నారు. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు, కార్మిక వర్గాల్లో కూడా ఆయనకు బలమైన ఫాలోయింగ్ ఏర్పడిందని అభివర్ణిస్తున్నారు. సినిమా, సోషల్ మీడియా, అభిమాన శక్తి, రాజకీయ సందేశాలు.. ఇలా అన్నీ కలిసి విజయ్ ఎదుగుదలకు కారణమయ్యాయని అంటున్నారు.

తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందా?

మొత్తంగా చూస్తే ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి తర్వాత సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రభావం చూపిన నాయకుడిగా విజయ్ ఎదుగుతున్నారా అనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
అయితే అసలు పరీక్ష ఇప్పుడు ప్రారంభమవుతోంది. సినిమాల్లో సమస్యలను చూపించడం ఒక విషయం అయితే, రాజకీయాల్లో వాటికి పరిష్కారాలు చూపించడం మరో విషయం. ప్రజల అంచనాలను నిలబెట్టుకోవడం, పార్టీని బలమైన రాజకీయ శక్తిగా నిలపడం విజయ్ ముందున్న అసలు సవాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+