ప్రధాని మోడీ అత్యవసర భేటీ..! మరిన్ని కీలక నిర్ణయాలు ?

యూరప్ టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఇవాళ సాయంత్రం అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. దీనికి మంత్రులతో పాటు ఉన్నతాధికారుల్ని సైతం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ కోసం మంత్రులు ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు కూడా పంపారు. దీంతో ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమాసియా సంక్షోభంతో పాటు కేబినెట్ ప్రక్షాళనపైనా ఇందులో చర్చించే అవకాశాలున్నాయి.

మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్ కు మెటా షాక్..!
మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్ కు మెటా షాక్..!

ప్రభుత్వంలో రాజకీయ, ఆర్థిక చర్చలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని సేవా తీర్థలో మంత్రివర్గ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశ కాలంలో కేంద్ర మంత్రులందరూ జాతీయ రాజధానిలోనే ఉండాలని కోరారు. ప్రధాని మోదీ తన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రులు, ఇతర సహాయ మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.

PM Modi Calls Emergency Cabinet Meet West Asia Crisis and Reshuffle on the Agenda
మెలోడీ చాక్లెట్ ఇచ్చిన మోడీ..! ఇటలీ ప్రధాని మెలోనీ రియాక్షన్ ఇదే..!
మెలోడీ చాక్లెట్ ఇచ్చిన మోడీ..! ఇటలీ ప్రధాని మెలోనీ రియాక్షన్ ఇదే..!

ఈ భేటీలో ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంఘర్షణ, దాని వల్ల భారతదేశంపై పడగల ఆర్థిక ప్రభావం వంటి అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే వెల్లడించింది. ఈ సంక్షోభాన్ని పర్యవేక్షించడానికి, అంతరాయాల నుంచి దేశాన్ని కాపాడటానికి చర్యలు సూచించడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఇప్పటికే మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి అనధికారిక బృందాన్ని ఏర్పాటు చేసింది.ఈ బృందంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. అలాగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి జూన్ 10న జరగనున్న మోదీ 3.0 ప్రభుత్వ మొదటి వార్షికోత్సవానికి ముందు, మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై పెరుగుతున్న ఊహాగానాల మధ్య ఈ సమావేశం రాజకీయ ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+