విజయ్ గెలుపుతో ఏపీలో ఫ్యాన్స్ సంబరాలు.. నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్!

తమిళనాట విజయ్ పార్టీ టీవీకే సాధించిన ఈ 'రికార్డ్ విజయం' కేవలం తమిళనాడులోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానుల్లో కూడా జోష్ నింపింది. తమిళనాడులో ఈరోజు వెలువడిన ఎన్నికల ఫలితాలలో ఊహించని విధంగా విజయ్ పార్టీ దూకుడు చూపించడంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

విజయ్ విజయం .. ఏపీలో ఫ్యాన్స్ సంబరాలు

ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలోని విజయ్ అభిమానులు విజయ్ పార్టీ విజయంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు. తమిళనాడు సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలో విజయ్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

Vijay Victory sparks grand celebrations and rallies in ap minister Nara Lokesh interesting tweet on vijay

సోషల్ మీడియాలోనూ విజయ్ ఫ్యాన్స్ హంగామా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉన్న విజయ్ అభిమానులు సైతం బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుతూ వేడుకలు చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా అభిమానుల ఆనందానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. విజయ్ గెలుపుని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . 'TVK Wave', 'ThalapathyPoliticalEntry', vijay victory, cm vijay, అంటూ హాష్ టాగ్ లతో వైరల్ చేస్తున్నారు.

విజయ్ కు మంత్రి లోకేష్ విషెస్

మరోవైపు విజయ్ గెలుపుతో ఆయన ఇంట్లో కూడా సంబరాలు కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యులు డాన్సులు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ అభినందనలు తెలిపారు.

ఆరంగేట్రంలోనే అదరగొట్టారని ట్వీట్

రాజకీయ రంగ ప్రవేశంలోనే ఆయన అదరగొట్టారని లోకేశ్ ప్రశంసించారు. ఆరంగేట్రంలోనే విజయ్ అదరగొట్టారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ''ఈ విజయం ఓటర్ల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. రాజకీయ యవనికపై సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టి, బాధ్యత, నిబద్ధతతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేయనున్న విజయ్‌కు శుభాభినందనలు'' అని నారా లోకేశ్‌ 'ఎక్స్‌'లో ఆసక్తికర పోస్టు చేశారు. ఇక సినీ ప్రముఖుల నుండి, రాజకీయ ప్రముఖుల నుండి విజయ్ కు శుభాకాంక్షలు వెల్లువగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+