ట్రంప్‌కు భారీ షాక్! ఇరాన్ విషయంలో అంతర్జాతీయ ట్విస్ట్!!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను కలకలాన్ని రేపుతున్నాయి. ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్థాన్ వేదికగా జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది. ఈ వైఫల్యం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌ను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు ఆ దేశ నౌకాశ్రయాలకు వెళ్లే, వచ్చే అన్ని రకాల ఓడలను అడ్డుకోవాలని, భారీ నౌకాదళ నాకాబందీ విధించాలని ఆదేశాలు జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం నేడు సాయంత్రం నుంచే ఈ దిగ్బంధనం అమలులోకి రానుండటంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

ఇరాన్ దిగ్బంధనానికి ట్రంప్ ఆదేశం.. హ్యాండిచ్చిన మిత్ర దేశాలు
అయితే ఇరాన్‌ను ఒంటరి చేయాలన్న ట్రంప్ వ్యూహానికి అమెరికా చిరకాల మిత్రపక్షాల నుంచే అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండే బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు ఈ పోరులో తాము భాగస్వాములం కాలేమని కుండబద్దలు కొట్టాయి. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఈ విషయంలో తన వైఖరిని స్పష్టం చేస్తూ.. అమెరికా నేతృత్వంలోని ఎలాంటి సైనిక చర్యల్లోనూ బ్రిటన్ పాల్గొనబోదని తేల్చి చెప్పారు. హోర్ముజ్ జలసంధిని మూసివేయడం లేదా దిగ్బంధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభం తలెత్తుందని.. ఇది సామాన్య ప్రజలపై విద్యుత్, గ్యాస్ బిల్లుల భారాన్ని విపరీతంగా పెంచుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "ఇది మా యుద్ధం కాదు, మమ్మల్ని ఈ వివాదంలోకి లాగకండి" అంటూ ఆయన ట్రంప్‌కు పరోక్షంగా గట్టి సంకేతాలే పంపారు.

Donald Trump Iran Naval Blockade Stalls as UK and Australia Withdraw Support Amid Energy Crisis Fears Details

సరైన నిర్ణయం కాదు: ఆస్ట్రేలియా ప్రధాని
మరోవైపు ఆస్ట్రేలియా కూడా అమెరికాకు తన సహాయ నిరాకరణను నిర్మొహమాటంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అంతర్జాతీయ సముద్ర చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ.. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ కూడా ఈ సంక్షోభంపై స్పందించారు. ఈ సమస్యకు కేవలం సైనిక చర్యల ద్వారా కాకుండా శాశ్వత దౌత్య పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యేలా ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణను మరో 45 నుంచి 60 రోజుల వరకు పొడిగించాలని ఆయన ప్రతిపాదించారు.

అమెరికా సెంట్రల్ కమాండ్ సర్వం సన్నద్ధం
మిత్రదేశాల నుంచి మద్దతు లభించకపోయినప్పటికీ.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మాత్రం తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు సర్వసన్నద్ధమైంది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇరాన్ సంబంధిత ఓడలపై కఠినమైన నిఘా ఉంచుతామని.. నాకాబందీని అమలు చేస్తామని ప్రకటించింది. అయితే, ఇరానేతర నౌకాశ్రయాల మధ్య ప్రయాణించే ఓడలకు మాత్రం ప్రస్తుతానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. తన ముఖ్య మిత్రపక్షాలే వెనక్కి తగ్గడంతో.. డొనాల్డ్ ట్రంప్ ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని, దిగ్బంధనాన్ని ఒంటరిగా ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+