పాకిస్తాన్ సంచలన నిర్ణయం- రాత్రి నుంచే
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాను స్తంభింపజేస్తోంది. భారత్ సహా అనేక దేశాల్లో పెట్రోల్, సహజవాయువుల సంక్షోభం తలెత్తింది. హార్ముజ్ జలంసంధిని ఇరాన్ నియంత్రిస్తోండటం దీనికి ప్రధాన కారణం.
దీని ప్రభావంతో పాకిస్తాన్ మరింత చితికిపోతోంది. పెట్రోల్ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి లీటర్ పెట్రోల్ 485 రూపాయలకు పెంచిందక్కడి ప్రభుత్వం. ఇప్పుడున్న ధరలకు అదనంగా 2.7 శాతం పెంచాలని నిర్ణయించింది. డీజిల్ ధరను లీటర్ ఒక్కింటికి 54.9 శాతంతో 520.35 పైసలకు పెంచేలా నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు అమలులోకి వచ్చాయి. దీంతో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమౌతోన్నాయి. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం రోడ్లెక్కారు.

దీంతో ప్రధాని షరీఫ్ యూటర్న్ తీసుకున్నారు. వీటి రేట్లను తగ్గించారు. పెట్రోల్ పై లీటర్ కు ఏకంగా 80 రూపాయల మేర తగ్గింపు ప్రకటించారు. డీజిల్ రేట్లల్లో మాత్రం తగ్గింపు ఇవ్వలేదు. మరికొన్ని వరాలను ప్రకటించారు. రాజధాని ఇస్లామాబాద్ తో పాటు దాని అన్ని నగరాలు, ప్రధాన పట్టణాల్లో ప్రజా రవాణాను పూర్తిగా ఉచితం చేశారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. నెల రోజుల పాటు ఇది అమలులో ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి దీన్ని పొడిగించాలా, వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.
ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, రావల్పిండి, ముల్తాన్, గుజ్రన్ వాలా, పెషావర్, క్వెట్టా, హైదరాబాద్, గ్వాదర్, బహవాల్ పూర్, సియాల్ కోట్ వంటి నగరాలు, ఎగువ మధ్యస్థాయి పట్టణాల్లో బస్సుల్లో ప్రజలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రజలు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని నియంత్రించడంలో భాగంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుం. దీనివల్ల ప్రజా రవాణా కార్పొరేషన్లకు వచ్చే నష్టంలో మూడొంతుల భాగాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
పాకిస్థాన్‌లో అత్యధిక జనాభా ఉన్న పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ కూడా ప్రభుత్వ రవాణా ఖర్చులను తొలగించారు. ట్రక్కులు, బస్సులకు భారీ సబ్సిడీలను ప్రకటించారు. పెరిగిన భారాలను ప్రయాణికులకు బదిలీ చేయవద్దని ఆపరేటర్లను కోరారు. పరిస్థితులు మెరుగుపడగానే ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీలో సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం మోటారిస్టులు, చిన్న రైతులకు ఇదే తరహా సబ్సిడీలను ప్రకటించారు మరియం నవాజ్.












Click it and Unblock the Notifications