ఆమె కోసమే భార్యకు విడాకులిచ్చిన స్టార్ హీరో .. కానీ ఇప్పుడు ఆమెతోనే బ్రేకప్ ???

తమిళ సినీ పరిశ్రమలో తనదైన నటన, వైవిధ్యమైన కథల ఎంపికతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో జయం రవి. 'తని ఒరువన్', 'బోగన్', 'అదంగ మారు', 'పొన్నియన్ సెల్వన్', 'పోన్మగళ్ వందాల్' వంటి చిత్రాలతో కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన రవి మోహన్.. తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా 'తని ఒరువన్' చిత్రాన్ని రామ్ చరణ్ 'ధృవ'గా రీమేక్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన పేరు బాగా పరిచయమైంది. ప్రస్తుతం సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన పేరును ఇకపై "రవి మోహన్"గా పిలవాలని అధికారికంగా ప్రకటించిన ఆయన.. వరుస వివాదాలు, సోషల్ మీడియా చర్చల మధ్య మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.

విడాకుల ప్రకటనతో షాక్

అయితే గత ఏడాది తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు రవి మోహన్ అధికారికంగా ప్రకటించడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. దాదాపు ఎన్నో ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ తీసుకున్న ఈ నిర్ణయం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండటం, బయటకు ఆదర్శ కుటుంబంలా కనిపించడం వల్ల ఈ వార్త మరింత సంచలనంగా మారింది. విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో రవిపై విమర్శలు కూడా వచ్చాయి. కొందరు అభిమానులు ఆయన నిర్ణయాన్ని సమర్థించగా, మరికొందరు కుటుంబాన్ని కాపాడాల్సిందని అభిప్రాయపడ్డారు. అప్పటి నుంచి రవి వ్యక్తిగత జీవితం నిరంతరం వార్తల్లోనే కొనసాగుతోంది.

jayam-ravi-alias-ravi-mohan-rumoured-girl-friend-kenisha-emotional-post-on-social-media-goes-viral

కెనీషాతో రిలేషన్ రూమర్స్

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సింగర్ కెనీషాతో రవి మోహన్ రిలేషన్‌లో ఉన్నారంటూ కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లలో కనిపించడం, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. దర్శకుడు గణేష్ కుమార్తె వివాహ వేడుకకు రవి మోహన్, కెనీషా కలిసి హాజరుకావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ప్రత్యేక బంధం ఉందా? అన్న చర్చ మరింత వేడెక్కింది. అయితే ఈ రూమర్లపై ఇప్పటివరకు రవి మోహన్ నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా కెనీషా చేసిన ఎమోషనల్ పోస్ట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

"నేను ఓడిపోయాను".. కెనీషా భావోద్వేగ పోస్టు

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కెనీషా చేసిన సుదీర్ఘ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన జీవితంలో జరిగిన పరిణామాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. ఈ కథలోకి ఎంతో ప్రేమతో వచ్చానని, కానీ ఇప్పుడు నిశ్శబ్దంతో వెనుదిరుగుతున్నానని రాసుకొచ్చారు. "కొన్నిసార్లు ప్రపంచం అహంకారాలు, అవాస్తవ కథనాలతో నిండిపోతుంది. అలాంటి చోట మంచితనానికి విలువ ఉండదు. ఒక మనిషిని రక్షించే ప్రయత్నంలో నేను చాలా కోల్పోయాను. కానీ ఇప్పుడు అర్థమైంది.. ఈ ప్రపంచం నిజాలను కాదు, భావోద్వేగాలతో అల్లిన కథలనే నమ్ముతుంది" అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

"అతడు ఇక పూర్తిగా మీవాడే"

ఇంకా ఆ పోస్టులో.. అతడిని ప్రేమించే వారికి, అతడి జీవితంపై హక్కులు ఉన్నాయని భావించే వారికి నేను చెప్పేది ఒక్కటే.. అతడు ఇక పూర్తిగా మీవాడే. ఇక నేను యుద్ధాలు చేయలేను. మంచి వ్యక్తులకు అండగా నిలబడాలని అనుకోవడం నా అమాయకత్వం" అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ, అభిమానుల ట్రోలింగ్ తనను తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్న కెనీషా.. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. తనకు ఎంతో ఇష్టమైన సంగీతాన్ని, థెరపీని కూడా వదులుకుంటున్నానని తెలిపారు. అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా డిలీట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

jayam-ravi-alias-ravi-mohan-rumoured-girl-friend-kenisha-emotional-post-on-social-media-goes-viral

రవి మోహన్ కెరీర్ మాత్రం ఫుల్ బిజీ

వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఎదుర్కొంటున్నప్పటికీ, కెరీర్ పరంగా రవి మోహన్ మాత్రం బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం 'బొంబ్లి', 'సిరెన్', 'తని ఒరువన్ 2' వంటి భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. ముఖ్యంగా 'తని ఒరువన్ 2'పై భారీ అంచనాలు ఉన్నాయి. కెనీషా పోస్టు తర్వాత వీరిద్దరి రిలేషన్‌పై కొత్త చర్చ మొదలైందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికైనా రవి మోహన్ లేదా కెనీషా అధికారికంగా స్పందించి ఈ వ్యవహారంపై క్లారిటీ ఇస్తారా? లేక ఈ రూమర్స్ అలాగే కొనసాగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+