పవన్ కు అంబటి అదిరిపోయే పంచ్..! విజయ్ తో పోలికపై..!

తమిళనాడులో సొంతంగా పార్టీ పెట్టి, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచాక ఇతరుల సాయం తీసుకుని ముఖ్యమంత్రి అయిన విజయ్ (Vijay)ప్రభావం అనివార్యంగా ఏపీలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై పడుతోంది. విజయ్ లాగే పవన్ కూడా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి గెలవాల్సిందంటూ ఈ మధ్య చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ తో తనకు పోలిక లేదంటూ పవన్ కళ్యాణ్ తాజాగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) ఘాటుగా స్పందించారు.

నాడు విజయ్ - నేడు సతీషన్ ..! దక్షిణాది రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ..!
నాడు విజయ్ - నేడు సతీషన్ ..! దక్షిణాది రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ..!

విజయ్ తో తనను పోల్చడంపై మండిపడుతూ పవన్ కళ్యాణ్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో గతంలో తాను ఒంటరిగా వెళ్లి రెండు చోట్ల పోటీ చేస్తే ఓడించారని, పొత్తులతో వెళ్లి గెలవాల్సి వచ్చిందంటూ ఆయన వెల్లడించారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్బందించారు. మీరు సీఎం కావాలని కాదు, ఎవరో సీఎం కావాలని పార్టీ పెట్టారని మాకు ఎప్పుడో తెలుసు అన్నారు. కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందన్నారు.

Ambati Rambabu Hits Back at Pawan Kalyan s Vijay Comparison Questions His Political Motives
విజయ్ తో నన్ను పోల్చద్దు..! గతాన్ని గుర్తుచేసిన పవన్..!
విజయ్ తో నన్ను పోల్చద్దు..! గతాన్ని గుర్తుచేసిన పవన్..!

పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే గెలవలేం అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఒంటరిగా వెళ్లి ఓడిపోయాను కాబట్టి ఇకపై పొత్తులతోనే వెళ్లాల్సి ఉంటుందన్నట్లుగా తన వ్యాఖ్యలతో పవన్ సంకేతాలు ఇచ్చినట్లయింది. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ మీరు సీఎం అయ్యేందుకు ఒంటరిగా వెళ్లరు, ఎవరినో సీఎం చేసేందుకు పొత్తులతోనే వెళ్తారంటూ అంబటి చురకలు అంటించారు. ఈ కొత్త వాదనపై పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+