భారతదేశపు భవిష్యత్ బుల్లెట్ ట్రైన్ హబ్‌ కేరాఫ్ బహదూర్ గూడా!

హైదరాబాద్ లో బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు శంషాబాద్ కు సమీపంలోని బహదూర్ పురా వేదిక కానుంది. హైదరాబాద్ ముంబై, హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై వయా అమరావతి కారిడార్ ల మధ్య బుల్లెట్ రైళ్ళ రాకపోకలు, వాటి కార్యాకలాపాలను బహదూర్ గూడా నుండి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు భారీ బస్ టెర్మినల్ కూడా ఇక్కడే నిర్మాణం చెయ్యాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.

విమానాశ్రయానికి సమీపంలో బుల్లెట్ ట్రైన్ హబ్

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి బుల్లెట్ ట్రైన్ హబ్ విమానాశ్రయానికి సమీపంలో ఉండాలని రెండు నెలల క్రితమే నిర్ణయం చేశారు .దీంతో రెవెన్యూ అధికారులను శంషాబాద్ తుక్కుగూడ ఓ ఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు సమీపంలో బహదూర్ గూడాలో ప్రభుత్వ భూములు అనువుగా ఉన్నాయంటూ సీఎంఓకు వివరించారు. దీనికి సంబంధించిన నివేదికను సైతం రూపొందిస్తున్నారు.

bullet train hub Bahadur Guda near shamshabad India s Future Bullet Train Hub with high speed corridors

రన్ వేకు కూతవేటు దూరంలో బహదూర్ గూడలో ప్రభుత్వ భూములు

శంషాబాద్ విమానాశ్రయం రన్ వేకు కూతవేటు దూరంలోని బహదూర్ గూడలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వేనెంబర్ 62 , 28లలో మొత్తం 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్ హబ్ నిర్మాణానికి 400 నుండి 500 ఎకరాల వరకు భూములు అవసరం అంటూ రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఒకే చోట 500 ఎకరాల భూమి ఉండడంతో రెవిన్యూ అధికారులు దీనిని ఎంపిక చేశారు.

విమాన, రైలు రవాణా కలయికకు ఇది అనువైన ప్రదేశం

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం బహదూర్‌గూడా ను ఎంపిక చేయడంలో ఆ ప్రాంతానికి అనేక వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండటం వల్ల విమాన, రైలు రవాణా కలయికకు ఇది అనువైన ప్రదేశంగా మారింది. ఓఆర్‌ఆర్, జాతీయ రహదారులు, రాబోయే రీజినల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో ఈ ప్రాంతానికి అద్భుత కనెక్టివిటీ ఉంది.

హైదరాబాద్ మెట్రో 2, 3 ఫేజ్ లపై సీఎం రేవంత్ రెడ్డి దూకుడు.. కేంద్రానికి విజ్ఞప్తి!
హైదరాబాద్ మెట్రో 2, 3 ఫేజ్ లపై సీఎం రేవంత్ రెడ్డి దూకుడు.. కేంద్రానికి విజ్ఞప్తి!

ఎలివేటెడ్ ట్రాక్‌లపై ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ మార్గాలు

భవిష్యత్ రవాణా మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన స్థల లభ్యత ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. బహదూర్‌గూడా, శంషాబాద్ పరిసర ప్రాంతాలు ఇప్పటికే రియల్ ఎస్టేట్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లకు కేంద్రంగా మారుతున్నాయి. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ మార్గాలను ప్రధానంగా ఎలివేటెడ్ ట్రాక్‌లపై నిర్మించనున్నట్లు సమాచారం. దీనివల్ల భూసేకరణ సమస్యలు తగ్గుతాయి. ట్రాఫిక్ అంతరాయం ఉండదు. వేగవంతమైన నిర్మాణం సాధ్యం అవుతుంది. పట్టణ ఆకృతి దెబ్బతినదు అని అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+