తెలంగాణా వాహనదారులకు పండుగే.. ఇకపై మీ కోసమే సారధి!
తెలంగాణా రాష్ట్రంలో వాహనదారులకు శుభవార్త. వాహనదారులకు ఇబ్బంది లేకుండా, వాహనదారులు రవాణా కార్యాలయాల చుట్టూ తిరగకుండా తెలంగాణ రవాణా శాఖ 17రకాల డ్రైవింగ్ లైసెన్స్ సేవలను ఫేస్‌లెస్ (ముఖాముఖి లేని) విధానంలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సులభంగా ఈ సేవలు పొందవచ్చు. సారధి వెబ్ సైట్ ద్వారా ఈ సేవలను అందిస్తుంది.
సారధి వెబ్ సైట్ ద్వారా వాహనదారులకు సేవలు
లెర్నర్ లైసెన్స్‌లో పేరు, చిరునామా, ఫోటో, సంతకం మార్పులు, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్ జారీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ,లైసెన్స్ రీప్లేస్‌మెంట్, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ సవరణలు,ఎండార్స్‌మెంట్ సేవలు (ప్రమాదకర పదార్థాల రవాణా వాహనాలు), పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్ డూప్లికేట్, లైసెన్స్ నుంచి వాహన తరగతి తొలగింపు, లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్ వంటి మరిన్ని సేవలు ఈ వెబ్ సైట్ ద్వారా అందించనుంది.
ఆధార్ ధృవీకరణతో సేవలు
ఈ సేవలను ఆధార్ ధ్రువీకరణ ద్వారా సారథి వెబ్‌సైట్ (sarathi.parivahan.gov.in) మరియు త్వరలో NextGen mParivahan యాప్ ద్వారా ఉపయోగించవచ్చు.ఈ విధానం ద్వారా డిజిటల్ పరిపాలనను ప్రోత్సహించడం,పారదర్శకత మెరుగుపరచడం సాధ్యం అవుతుంది. మధ్యవర్తులు, అవినీతి తొలగించడం, ఆర్టీవో కార్యాలయాల్లో రద్దీ తగ్గించడం,వాహనదారుల సమయం, శ్రమ ఆదా చేయడం సాధ్యం అవుతుంది.
రవాణాశాఖలో డిజిటల్ గవర్నెన్స్
రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి ఈ సేవలను విడుదల చేస్తూ, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు మరో మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. సారథి పోర్టల్‌లో లాగిన్ అయి, ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేసి సంబంధిత సేవను ఎంచుకోండి.
ఈ కొత్తవ్యవస్థతో వాహనదారుల జీవితం సులభం
స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఎప్పుడైనా, ఎక్కడైనా పనులు పూర్తి చేసుకోవచ్చు.ఈ కొత్త వ్యవస్థతో వాహనదారుల జీవితం సులభం కానుంది. రవాణా కార్యాలయాల వద్ద గంటల తరబడి పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇది నిజంగా వాహనదారులకు చాలా సంతోషం కలిగిస్తున్న అంశం.














Click it and Unblock the Notifications