తెలుగు రాష్ట్రాల్లోని ఈ అద్భుతమైన హిల్ స్టేషన్స్ గురించి తెలుసా..?

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పిల్లలకు వేసవి సెలవులు కూడా ఇచ్చేశారు. అయితే ఈ సమ్మర్ లో చల్లని ప్రదేశాల్లో విహరించాలని అనుకుంటున్నారా..? మనకు దగ్గర్లోనే కొన్ని పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. వేసవిలో ఇక్కడికి వెళ్తే మళ్లీ రావాలని అనిపించదు. అంత అద్భుతంగా ఈ ప్రదేశాలు ఉంటాయి. సాధారణంగా వేసవిలో చాలా మంది ఉత్తర్ భారత్ లోని హిల్ స్టేషన్స్ ను సందర్శిస్తుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అద్భుతమైన హిల్ స్టేషన్స్ గురించి మీకు తెలుసా..? వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

వీటిలో మొదటగా చెప్పుకోవాల్సింది తెలంగాణ ఊటీగా పేరుగాంచిన అనంతగిరి కొండలు. ఆధ్యాత్మికత, పకృతి, చారిత్రక, వారసత్వ కట్టడాలు అలాగే పురాతన సంపదకు అనంతగిరి నెలవుగా చెబుతారు. సాధారణంగా ఈ ప్రాంతాన్ని వీకెండ్స్ లో వేలాదిమంది సందర్శిస్తుంటారు. వేసవి సెలవుల్లో ఇక్కడ ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది. వికారాబాద్ కు సమీపంలోని ఈ ప్రాంతం దాదాపు 3,500 లకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్, బోటింగ్, నేచర్ వాక్ చాలా ప్రత్యేకం.

నల్లమల అడవులు పర్యటకులకు ఎప్పుడూ బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం స్వర్గధామం అని చెప్పొచ్చు. ఎత్తైన కొండ ప్రాంతాలు.. చుట్టూ పచ్చని ప్రకృతితో ఈ నల్లమల అడవులు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తాయి. నల్లమల అడవుల్లో మహానది ఆలయం, అలాగే నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ను చూడొచ్చు. ఆ తర్వాత చెప్పుకోదగిన మరో టూరిస్ట్ ప్రాంతం లంబసింగి. ఈ ప్రాంతాన్ని ఆంధ్రా కాశ్మీర్ అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతాలు, యాపిల్ తోటలు, జలపాతాలు పర్యటకుల్ని కనువిందు చేస్తాయి. ఇక్కడ క్యాంపింగ్, ట్రెక్కింగ్ అందుబాటులో ఉన్నాయి.

Hill Stations Amazing Telugu States These Beautiful Spots in Telangana and AndhraWill Surprise You

ఆ తర్వాత హార్సిలీ హిల్స్ ప్రాంతానికి మంచి పేరుంది. నిత్యం ఈ పర్యటక ప్రాంతానికి అనేకమంది తరలివస్తుంటారు. ఇక హాలీడేస్, సమ్మర్ సీజన్ లో అయితే ఈ సంఖ్య డబుల్ అవుతుంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఈ ప్రాంతానికి టూరిస్టుల తాకిడి పెరిగింది. ఈ ప్రాంతాన్ని ఆంధ్రా ఊటీగా పిలుస్తుంటారు. ఇక్కడి వాతావరణం ఊటీని తలపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఉన్న ఈ పర్యటక ప్రాంతాలను మీరూ ఓ సారి సందర్శించండి..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+