SBI బ్యాంక్ లో భారీ ఫ్రాడ్.. పక్కాగా ప్లాన్ చేసి.. రూ.2.65 కోట్లను దోచేశారు..
అందరూ డబ్బును బ్యాంకర్లలో దాచుకుంటారు. ఒక్కో రూపాయి సంపాదించి బ్యాంకులో వేసి తమ డబ్బు భద్రంగా ఉందంటూ భరోసాగా ఉంటారు. ఇంటి కంటే బ్యాంకే తమకు నిజమైన సెక్యూరిటీగా భావిస్తారు. అందరూ అంతలా నమ్మకంగా భావించే బ్యాంకులోనే దోపిడీ జరిగితే..? అది కూడా అందులో పనిచేసే ఉద్యోగులే అయితే..? వింటానికి షాకింగ్ గానే ఉన్నా.. ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 2.65 కోట్ల రూపాయలను ఈ గ్యాంగ్ దారి మళ్లించింది. అయితే వీరిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకోవడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
ఎస్బీఐలో భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. నిందితుల్లో ఎస్బీఐ సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ వెంకట రామాంజనేయులు.. అలాగే దేవరకొండ బ్యాంకులో హౌజ్ కీపింగ్ స్టాఫ్ గా చేస్తున్న చక్రపాణి, రికవరీ ఏజెంట్ రామ్ లాల్, ఫోటో గ్రాఫర్ శివ ఉన్నారు. చాలాకాలంగా ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఉన్న బ్యాంకు అకౌంట్స్ ను వీళ్లు టార్గెట్ చేశారు. అలా బ్యాంకు మేనేజర్ తనకున్న 10 ఖాతాల తీసుకున్నారు. వాటికి ఫేక్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులను సృష్టించారు.

కొత్త నంబర్లతో కేవైసీ అప్డేట్ చేసి.. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కొత్ యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లను పొందారు. అలా ఆ అకౌంట్స్ లో ఉన్న డబ్బును తమకు తెలిసిన వారి అకౌంట్ లోకి మళ్లించారు. ఈ మేరకు నరేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 2.42 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇదే కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications