NRI News: అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
అమెరికాలో విషాదం జరిగింది. యూఎస్ లోని మిస్సోరి స్టేట్ లో తెలంగాణకు చెందిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. శనివారం శ్యాండిల్ ఎస్ టౌన్ లో ఈత కొట్టేందుకు ముగ్గురు స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్లోకి దిగాడు. అయితే కిరణ్ కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగాడు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని స్నేహితులు తెలిపారు. కిరణ్ 2023 నవంబర్ లో అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం అతను శ్యాండిల్ టౌన్ లో ఎంఎస్ చేస్తున్నాడు.
కిరణ్ కు తండ్రి లేడు. తల్లి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటుంది. కిరణ్ కు తండ్రి లేకపోవడంతో వారి బాధ్యతలను తాతా కృష్ణమూర్తి రాజు చూసుకుంటున్నారు. కిరణ్ చదివించిన ఆయన.. ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించారు. అయితే యూఎస్ కిరణ్ చనిపోవడంతో కుటంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నకొరుకొండి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కిరణ్ మృతదేహాం గురువారం నాటికి స్వగ్రామానికి వస్తుందని కుటుంబ సభ్యుల చెప్పారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలో చదువుకునేందుకు చాలా మంది వెళ్తున్నారు.

దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మనవాళ్లే ఎక్కువగా యూఎస్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే 2016లో 3,20,000 మంది ఉండే తెలుగువారి సంఖ్య 2024 నాటికి 1.23 మిలియన్లకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉండగా.. అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషగా 3వ స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో హిందీ, గుజరాతీ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు మాట్లాడేవారిలో దాదాపుగా 2 లక్షల మంది నివాసితులు కాలిఫోర్నియాలో నివేదికలు చెబుతున్నాయి.
టెక్సాస్‌లో 1,50,000 మంది ఉండగా.. న్యూజెర్సీలో1.10 లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. 2010 నుంచి 2017 మధ్య అమెరికాలో తెలుగు మాట్లాడేవారు 85 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications