ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐతో పాఠాలు.. వారి ఫ్యూచర్ కి తిరుగేలేదు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుతం కృత్రిమ మేధ ప్రపంచాన్ని మరో మెట్టు పైకి తీసుకు వెళుతున్న సమయంలో విద్యార్థి దశ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక అంశాలను నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధనలో చెప్పాలనుకున్న పాఠ్యాంశాన్ని పూర్తి స్థాయిలో క్షేత్ర పర్యటనలో చెప్పినట్టుగా విద్యార్థికి అర్థవంతంగా చెప్పడానికి వీలు కలుగుతుందని చెప్పవచ్చు.
ప్రభుత్వ పాఠశాలలలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బయటకు వెళ్లి చూపించలేని అనేక అంశాలను విజువలైజ్ చేసే విద్యార్థులకు చూపించవచ్చు. తద్వారా విద్యార్థికి పూర్తిస్థాయి అవగాహన కల్పించి, విద్యార్థి మనసు పైన మరచిపోలేని ముద్ర వేసి సబ్జెక్ట్ బాగా అర్థమయ్యేలా చెప్పవచ్చు. ఈ క్రమంలోని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా విధానంలో ఒక భాగంగా మారింది.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో విద్యార్థుల సామర్ధ్యానికి తగ్గట్టు టీచింగ్
ప్రభుత్వ పాఠశాలలలో ఇప్పటికే అన్ని రకాల వసతులు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా డిజిటల్ క్లాస్ రూమ్ లతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక సబ్జెక్టులను బోధించే విధానాన్ని కూడా టీచర్లకు ట్రైన్ చేశారు. విద్యార్థులలోని బలహీనతలను, సామర్థ్యాలను గుర్తించి వారికి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో అదే విధంగా వారికి బోధన చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యావ్యవస్థలో ఒక భాగంగా మారిపోయింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఫలితాలను మెరుగుపరిచే ఏఐ
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వ్యక్తిగత అభ్యాసవేదికలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తోంది. ఈ విధానం విద్యార్థులకు మరింత ఆసక్తికరంగా, సులభంగా అర్థమయ్యేలా ఉండటంతో వారు చదివే తీరు మెరుగవుతుంది. ఉపాధ్యాయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ ఫార్మ్స్ ద్వారా విద్యార్థుల ప్రగతిని సులభంగా అంచనావేసి అవసరమైన సహాయం అందించేందుకు వీలు కలుగుతుంది.
విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులకు ఏఐతో ప్రయోజనం
AI ఆధారిత వ్యక్తిగత అభ్యాస వేదికలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పును తీసుకువస్తున్నాయి. ఇది నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అటు విద్యార్థులకు మాత్రమే కాకుండా ఇటు ఉపాధ్యాయులకు సైతం వారి బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలలో ఏఐ ఆధారిత వ్యక్తిగత అభ్యాస వేదికల వినియోగం విద్యార్థుల భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా మారుస్తుంది.
-
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications