మీడియా రంగంలో ఏఐ.. మానవ నైపుణ్యానికి జోడింపా? సవాలా?
కృత్రిమ మేధస్సు.. ప్రపంచంలో అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. కృత్రిమ మేధస్సు చేయని పని అంటూ లేదు. కృత్రిమ మేధస్సు జర్నలిజాన్ని సైతం పునర్నిర్మిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వార్తలను కూడా పునరుత్పత్తి చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ పరిస్థితి సాంప్రదాయ జర్నలిజం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఈ మార్పు వార్తా ప్రపంచంలో పురోగతితో పాటు వేగవంతమైన వార్తా పంపిణీకి ఒక అవసరంగా పరిగణించబడుతుంది.
మానవ సామర్థ్యం కంటే ఎక్కువ సామర్థ్యంతో డేటాను ప్రాసెస్ చేసే ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే ఒక వ్యక్తి రాసిన వార్తా వ్యాసాల కన్నా, అదనపు ఇన్ఫర్మేషన్ తో ఎక్కువ వార్తావ్యాసాలను రూపొందించగలవు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా పనిచేసే అనేక వ్యవస్థలు
అదనపు వేగంతో, అదనపు సామర్థ్యంతో మంచి వ్యాసాలను అందిస్తాయి. జెమిని, చాట్ జీపీటీ, గ్రోక్, క్లాడ్, గూగుల్ ఏఐ ఓవర్ వ్యూ, వైజ్ ఇలా అనేక ఏఐ వనరులు మానవ సామర్థ్యం కంటే ఎక్కువ సామర్థ్యంతో డేటాను ప్రాసెస్ చేస్తాయి.

జర్నలిస్ట్ ల ఉద్యోగ భద్రతకు పెను సవాల్ గా ఏఐ
సమయానుకూలంగా నవీకరణలను అందిస్తాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వార్తల్లో కచ్చితత్వాన్ని మాత్రం నిర్ధారించలేము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తి చేసే కంటెంట్ జర్నలిస్టుల ఉద్యోగ భద్రత కు పెను సవాల్ గా పరిణమిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి వార్త ఇతర ప్లాట్ఫామ్ లలో వచ్చిన వాటి ద్వారా జనరేట్ చేయబడిన ఆర్టికల్ అవుతుంది తప్ప, వార్తకు సంబంధించిన కొత్త వార్త అయితే కాదు.
ఏఐ సాంకేతికతను మానవ నైపుణ్యానికి జోడిస్తే మెరుగ్గా మీడియా
ఏఐ ఉత్పత్తి చేసే కంటెంట్ ఒక జర్నలిస్ట్ సేకరించిన కచ్చితత్వంతో రాసిన నిర్ధారించిన, స్వీకరించిన వార్తతో సమానంగా ఉండదు. మానవ నైపుణ్యంతో సాంకేతికతను సమతుల్యం చేయడం చేస్తే పర్వాలేదు కానీ, సాంకేతికతను ఆధారం చేసుకొని మానవ నైపుణ్యాన్ని పక్కన పెడితే మాత్రం మీడియా రంగంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను మానవ నైపుణ్యానికి జోడించినా మరింత మెరుగ్గా మీడియా రంగం పనిచేసే అవకాశం ఉంటుంది.
ఏఐ వినియోగం మీడియాపై ఎలా ఉంటుందో
జర్నలిజంలో దాని పాత్ర విస్తరించే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి మీడియా పురోగతికి దోహదం చేసేలా ఉంటే పర్వాలేదు కానీ మానవ వనరులకు విఘాతం కలిగించేలా ఉండకూడదు అనేది నిపుణుల అభిప్రాయం. ఏఐ వినియోగం మీడియాలో రోజురోజుకీ పెరుగుతున్న నేపధ్యంలో దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది భవిష్యత్ లో తెలియనుంది.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications