ఈ కోర్సులు నేర్చుకుంటే 2026లో సాఫ్ట్‌వేర్ జాబ్ పక్కా..!
2026 నాటికి మార్కెట్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు చాలా మార్పులు కనిపించనున్నాయి. సాధారణ నియామకాలు కొంత మేర మందగించినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్, డేటా ఇంజినీరింగ్ వంటి రంగాలలో ఉద్యోగ అవకాశాలు మునుపెన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్నాయి.
కంపెనీలు కేవలం కోడర్‌లను కాకుండా, ఆధునిక ఎకోసిస్టమ్‌లను అర్థం చేసుకుని, రియల్ టైమ్ సమస్యలను పరిష్కరించగల డెవలపర్‌లను కోరుకుంటున్నాయి. కాబట్టి, 2026లో అత్యుత్తమ ఉద్యోగాలు సంపాదించాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి? వాటిని సరళంగా విశ్లేషిద్దాం.

Python: 2026లో అత్యధిక డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పైథాన్ ఒకటిగా కొనసాగుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, ఆటోమేషన్, బ్యాకెండ్ డెవలప్‌మెంట్, AI ఇంజినీరింగ్‌లకు ఇది బలమైన పునాదిగా పనిచేస్తోంది. భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ఉపయోగపడే నైపుణ్యాన్ని సాధించాలంటే, పైథాన్ ఇప్పటికీ అత్యంత నమ్మదగిన ఎంపికగానే ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
JavaScript: వెబ్‌సైట్‌లు, డాష్‌బోర్డ్‌లు, మొబైల్ యాప్‌ల అభివృద్ధిలో జావాస్క్రిప్ట్ (JavaScript) కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఒకటి. అయితే,నేటి ఆధునిక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ప్రత్యేక ప్రాధాన్యతను సంపాదించుకుంటున్న భాష టైప్‌స్క్రిప్ట్ (TypeScript). స్ట్రాంగ్ టైపింగ్, క్లీనర్ కోడ్ స్ట్రక్చర్, పెద్ద అప్లికేషన్‌లలో ఉన్నత స్థాయి విశ్వసనీయత వంటి లక్షణాలు, టైప్‌స్క్రిప్ట్ విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
JAVA: AI ట్రెండ్ ఉన్నా, కొన్ని కంపెనీలు జావాకు అధికంగా ప్రాధాన్యం ఇస్తున్నాయి.బ్యాంకులు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రభుత్వ వ్యవస్థలు, టెలికాం నెట్‌వర్క్‌లు జావా (Java)ను దాని భద్రత, స్కేలబిలిటీ కారణంగా ఇంకా ఈ లాంగ్వేజ్ పైనే ఆధారపడ్డాయి..
C#: ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, క్రాస్-ప్లాట్‌ఫామ్ యాప్స్, గేమ్ డెవలప్‌మెంట్, ఇంటర్నల్ టూల్స్, Azure ఆధారంగా చేయబడిన క్లౌడ్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో ప్రముఖ స్థానం పొందింది. మైక్రోసాఫ్ట్ తమ.NET ఎకోసిస్టమ్‌లోకి AIని తీసుకువస్తుండటంతో, ఎంటర్‌ప్రైజ్ ఉద్యోగాల కోసం అత్యుత్తమ లాంగ్వేజ్‌గా C# నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
RUST: రస్ట్(RUST) ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ దాటింది. ప్రభుత్వాలు, ప్రపంచవ్యాప్త కంపెనీలు, సెక్యూరిటీ బృందాలు మెమరీ-సేఫ్ లాంగ్వేజెస్‌కు మళ్లుతున్నాయి. రస్ట్(RUST) ఈ మార్పులో ముందంజలో ఉంది.ఆపరేటింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్, బ్రౌజర్ ఇంజన్‌లు, బ్లాక్‌చెయిన్ సిస్టమ్స్, హై-పెర్ఫార్మెన్స్ సర్వర్‌లలో దీనిని ఉపయోగిస్తారు. సైబర్‌సెక్యూరిటీ, సిస్టమ్-లెవెల్ ఇంజినీరింగ్, లేదా అప్‌గ్రేడెడ్ రోల్స్‌లో పనిచేయాలనుకునే వారికి రస్ట్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.
SQL:AI, క్లౌడ్, అనలిటిక్స్, వెబ్ యాప్‌లు అన్నీ డేటాపై ఆధారపడి ఉంటాయి. అందుకే SQL (Structured Query Language) అన్ని ఉద్యోగాలకీ అత్యంత డిమాండ్ ఉన్న లాంగ్వేజ్‌గా ముద్ర వేసుకుంది.డేటా ఇంజినీరింగ్, బ్యాకెండ్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్, క్లౌడ్ డేటా ప్లాట్‌ఫారమ్‌లకు ఇది తప్పనిసరి.మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ఎంచుకున్నా, SQLను నేర్చుకుంటే అడ్వాంటేజ్ గా మారుతుందని చెప్తున్నారు.
డెవలపర్‌ల కోసం టెక్నాలజీ ప్రపంచం నిరంతరం మారుతున్నప్పటికీ, స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నవారి కోసం డిమాండ్ అధికంగానే ఉంది. మీరు కొత్తగా కెరీర్ ప్రారంభించినా లేదా అప్‌స్కిల్ చేసుకోవాలనుకున్నా, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ 2026లో మీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగ భవిష్యత్తును రూపొందిస్తాయి లేదా నిర్ణయిస్తాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications