అమెజాన్ ఉద్యోగులకు ఏఐ షాక్-సీఈవో ముందస్తు హెచ్చరికలు..!
రాబోయే రోజుల్లో ఏఐ ప్రభావంతో కంపెనీలో ఉద్యోగాల స్వరూపంలో పెను మార్పులు తప్పవని అమెజాన్ సీఈవో అండీ జస్సీ ఉద్యోగుల్ని హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాల్లోకి కృత్రిమ మేథ వేగంగా దూసుకొస్తోంది. ఓవైపు ఏఐ దూకుడుతో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటుండగా.. ఉద్యోగులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఏఐ కారణంగా తమ ఉద్యోగాలు ఎక్కడ కోల్పోతామన్న భయం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా బహుళ జాతి సంస్ధలు ఏఐని అమల్లోకి తెచ్చి ఖర్చులు తగ్గించుకుంటూ, లాభాలు పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉద్యోగులకు శాపంగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ కూడా తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. కృత్రిమ మేధ ప్రభావం గురించి వారికి కీలక సూచనలతో కూడిన హెచ్చరిక చేశారు. ఏఐ ఆధారిత సామర్థ్యాల కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని ఆయన తేల్చిచెప్పేశారు. అలెక్సా ప్లస్ నుండి అంతర్గత కార్యకలాపాల వరకు కంపెనీ ఏఏఐని విస్తృతంగా అనుసంధానిస్తోందని తెలిపారు. తద్వారా వినియోగదారుల అనుభవాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

దీంతో ఏఐని స్వీకరించాలని, దాని అభివృద్ధికి సహకరించాలని అమెజాన్ ఉద్యోగులను జస్సీ కోరారు. అమెజాన్ భవిష్యత్తులో ఇది ఒక ముఖ్యమైన మార్పుకు సంకేతంగా నిలుస్తుందన్నారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేథ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ తన 1.5 మిలియన్ల మంది ఉద్యోగులకు హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న అనేక ఉద్యోగాలలో మానవ శ్రామికుల అవసరం ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థల ద్వారా తగ్గుతుందని ప్రకటించారు.
జూన్ 17న విడుదల చేసిన ఓ మెమోలో తక్కువ ఉద్యోగాలను చేయడానికి తక్కువ మంది సరిపోతారన్నారు. రాబోయే కొద్ది సంవత్సరాలలో ఈ మార్పు తమ మొత్తం కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తుందన్నారు. ఈ ప్రకటన సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్ , ఇతర వైట్-కాలర్ ఉద్యోగాలలో పనిచేస్తున్న అమెజాన్ యొక్క 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది.

పరిశోధన, కోడింగ్ , ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులను నిర్వహించగల స్వయంప్రతిపత్త సాఫ్ట్‌వేర్ వ్యవస్థలైన ఏఐ ఏజెంట్ల ద్వారా భవిష్యత్తు ఉంటుందని జస్సీ వెల్లడించారు. షాపింగ్, ప్రయాణం నుండి రోజువారీ పనుల వరకు ప్రతిదీ నిర్వహించడానికి, ప్రతి కంపెనీలో , ఊహించదగిన ప్రతి రంగంలో ఈ ఏజెంట్లు బిలియన్ల సంఖ్యలో ఉంటారన్నారు. ఉద్యోగాల తొలగింపు హెచ్చరిక చేసినప్పటికీ, మార్పులకు అనుగుణంగా ఉండాలనుకునే ఉద్యోగులకు ఇది ఒక అవకాశమని తెలిపారు. ఏఐ గురించి తెలుసుకోవాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్‌షాప్‌లకు హాజరై శిక్షణ తీసుకోవాలని ఉద్యోగుల్ని కోరారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications