ఏయూ లో 10 వేల మంది విద్యార్థులకు AI శిక్షణ, స్టార్టప్ కు మద్దతు..!!

ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఏఐ ఎంట్రీతో సాంకేతికత కొత్త టర్న్ తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నైపుణ్య శిక్షణకు డిమాండ్ కనిపిస్తోంది. ఏఐ లో నైపుణ్యం వారికే ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటున్నాయి. ఏఐ విస్తరిస్తున్న వేళ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సైతం సహకరించేలా ఏఐ కంప్యూటింగ్‌ సంస్థ ఎన్విడియాతో ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నోడల్‌ ఏజెన్సీగా ఎంపిక చేసింది. ఈ యూనివర్సిటీ ద్వారా ఏఐ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏఐ విద్యకు నోడల్ ఏజెన్సీగా గుర్తించటంతో ఇక్కడ పాఠ్య ప్రణాళిక, శిక్షణ, పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఔట్‌రీచ్‌ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో ప్రాథమిక, అడ్వాన్స్, జనరేటివ్‌ ఏఐ తదితర 5 దశలున్నాయి. ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌ తరగతులను నిర్వహించే అవకాశముంది.

Andhra University to offer AI training for faculty and students details here

శిక్షణకు అవసరమైన సాఫ్ట్‌వేర్, వాటిని సమర్ధవంతంగా వినియోగించడానికి అవసరమైన సేవలను ఎన్విడియా సంస్థ అందిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 మంది ఫ్యాకల్టీ, 10,000 మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్య శిక్షణను అందిస్తారు. శిక్షణలో భాగంగా 500 ఏఐ ఆధారిత స్టార్టప్ లకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు.

విద్యార్థులకు శిక్షణ పూర్తయిన తర్వాత స్టార్టప్ సంస్థలు పెట్టాలని ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేకంగా శిక్షణను సైతం ఇవ్వనున్నారు. వారి ఆలోచన కార్యరూపంలోకి వచ్చేలా ఎన్విడియా ప్రతినిధులు మార్గనిర్దేశం చేస్తారు. ముందుగా ఫ్యాకల్టీలకు శిక్షణ ఇవ్వనున్నారు. వర్సిటీల్లోని రీసెర్చి స్కాలర్ల ను ట్యుటోరియల్‌ అసిస్టెంట్లగా నియమించనున్నారు. పది వేల మంది విద్యార్ధులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఏఐ శిక్షణ నేర్చుకోవడం ద్వారా ఆచార్యులు, విద్యార్థులకు బహుళ ప్రయోజనాలున్నాయి. శిక్షణకు అవసరమైన ఖర్చులు ఎన్విడియా సంస్థ భరిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+