మెటా మెడపై కత్తి- LLM తో వివాదం: అనూహ్యంగా సంకట స్థితిలో..

సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫార్మ్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల చోటు చేసుకున్న భారీ లేఆఫ్‌ ప్రక్రియలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం నూతన వివాదాలకు తెర తీసింది. తమపై వివక్ష చూపారంటూ 26 మంది మాజీ ఉద్యోగులు కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. వికలాంగులతో పాటు అనారోగ్య కారణాల వల్ల మెడికల్ లీవ్ తీసుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ లేఆఫ్స్ జరిగాయని ఆరోపించారు.

ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి ఏఐ టూల్ ను మెటా ఉపయోగించిందనేది వారి ప్రధాన ఆరోపణ. ఈ విధానంపై పిటీషన్లు దాఖలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగుల కమ్యూనికేషన్లను పర్యవేక్షించే మెటామేట్ అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) అసిస్టెంట్, సెకండ్ బ్రెయిన్ అనే వ్యవస్థలతో పాటు, కీబోర్డ్ స్ట్రోక్స్, స్క్రీన్ ఇన్ఫో, బ్రౌజర్ హిస్టరీ, ఈమెయిల్‌ను స్కాన్ చేయడం ద్వారా సేకరించిన ప్రొడక్టివిటీ స్కోర్‌ ఆధారంగా తమ పనితీరును అంచనా వేసినట్లు వాదిస్తున్నారు.

Former Employees Sue Meta Claiming AI Disproportionately Targeted Medical Leave and Disability

అనారోగ్యం వల్ల గానీ, తమ కుటుంబ సభ్యుల సంరక్షణ కోసం మెడికల్ లీవ్ తీసుకున్న ఉద్యోగులు ఆఫీసులకు రాలేకపోవడంతో ఏఐ టూల్స్ వారి పనితీరును లో-గ్రేడ్ గా అంచనా వేసిందని చెబుతున్నారు మాజీ ఉద్యోగులు. సెలవుల్లో ఉన్న ఉద్యోగుల కీబోర్డ్ స్ట్రోక్స్, స్క్రీన్ ఇన్ఫో, బ్రౌజింగ్ హిస్టరీ సహజంగానే తక్కువగా ఉంటుందని, దీని ఆధారంగా తమను ఎలా లేఆఫ్స్ చేయగలుగుతారని అంటున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని ఆ 26 మంది ఉద్యోగులు న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేశారు.

HCL: లేఆఫ్స్ షాక్‌ల తర్వాత.. కంపెనీ నుంచి గుడ్ న్యూస్!
HCL: లేఆఫ్స్ షాక్‌ల తర్వాత.. కంపెనీ నుంచి గుడ్ న్యూస్!

కాలిఫోర్నియా, న్యూయార్క్ లల్లో అమలులో ఉన్న నూతన చట్టాల ప్రకారం.. ఇటువంటి లేఆఫ్స్ ప్రకటించడానికి ముందు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలలోని లోపాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో లోపాలు లేవని తేలిన తర్వాతే లేఆఫ్స్ ప్రకటించాలి. దీనికి భిన్నంగా ఏఐ ఇచ్చిన డేటాను ఆధారంగా చేసుకుని మెటా తమను తొలగించిందని అంటున్నారు. మెటా ఇచ్చిన రిపోర్ట్ లోని లోపాలను పరిశీలించకుండా తమపై వేటు వేసిందని ఉద్యోగులు పేర్కొంటోన్నారు.

అమెరికాకు చెందిన ఓ టెక్ సంస్థలో ఏఐ సహాయంతో ఉద్యోగులను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మొదటి కేసు ఇదే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల వాదనలను మెటా ప్రతినిధి ఒకరు తోసిపుచ్చారు. మానవ వనరుల నిర్వహణకు సంబంధించిన ఏ నిర్ణయమైనా యాజమన్యం స్వయంగా తీసుకుంటుందని, వీటిలో ఏఐ పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌కు ఎలాంటి చట్టపరమైన విలువ లేదని పేర్కొన్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం- ఈ రాష్ట్రాలకు భారీ వర్షసూచన: బంగ్లాదేశ్ పైనా
బంగాళాఖాతంలో అల్పపీడనం- ఈ రాష్ట్రాలకు భారీ వర్షసూచన: బంగ్లాదేశ్ పైనా

కంపెనీలో ఆర్గనైజేషనల్ ప్రాధాన్యతలను మార్చుకోవడంలో భాగంగా మెటా సుమారు 8,000 మంది ఉద్యోగులు, అంటే దాదాపు 10 శాతం మందిని తొలగించింది. లేఆఫ్స్ యథేచ్ఛగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మెటా ఉద్యోగులు లేవనెత్తిన ఈ అంశాలు ఇతర ఐటీ కంపెనీలను కూడా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ కేసు ఫలితం రాబోయే రోజుల్లో ఏఐ వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలు, ఉద్యోగ భద్రత నిబంధనలను ప్రభావితం చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+