క్యాన్సర్ రోగులకు AI సేవలు - ఈ ఆస్పత్రుల్లో వైద్యం..!!

ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు వైద్య రంగంలో కీలకంగా మారుతోంది. చికిత్సలో ఏఐ ఆధారిత సేవలు వినియోగంలోకి వస్తున్నాయి. తాజాగా క్యాన్సర్ రోగులకు ఏఐ ఆధారిత ఖచ్చిత మైన సేవలు అందించేందుకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ రోగులకు మెరుగైన సేవల కోసం ఏఐ వినియోగిస్తున్నారు. దీని ద్వారా క్యాన్సర్ బారిన పడిన వారికి ప్రయోజనం కలగనుంది.

క్యానర్సర్ మహమ్మారితో భారీగా మరణాలు నమోదు అవుతున్నాయి. తొలి దశలోనే క్యాన్సర్ గుర్తిస్తే చికిత్స ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం వైద్య బోధన ఆస్పత్రుల్లో నేషనల్‌ క్యాన్సర్‌ గ్రిడ్‌ ఏపీ చాప్టర్‌ను ఏర్పాటు చేసింది. టాటా మోమెరియల్‌ సెంటర్‌, హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌, నవ్య కేర్‌ నెట్‌వర్క్‌లతో కలసి నేషనల్‌ క్యాన్సర్‌ గ్రిడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే NCG పైలెట్‌ ప్రాజెక్ట్‌ సేవలు గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలోని క్యాన్సర్ సెంటర్‌లో ప్రారంభం అయ్యాయి.

Artificial intelligence Services in Guntur Natco Cancer Center for Cancer patients

విశాఖ, కాకినాడ ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సలో ఇప్పటికే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సేవల్ని ఉపయోగిస్తుండగా తాజాగా గుంటూరు, కర్నూలు ఆసుపత్రుల్లో కృత్రిమ మేధ ద్వారా రోగు లకు మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి ఆంకాలజీ విభాగం నోడల్‌ సెంటర్‌గా విశాఖ, కాకినాడ, కర్నూలు ప్రభుత్వాస్పత్రులను అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఏఐ సేవల వల్ల ఇక క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించడంతోపాటు అత్యుత్తమ విధానాలతో చికిత్సకు వీలు కలుగులోంది. క్యాన్సర్ చికిత్స కోసం నాట్కో కేంద్రంలో ఉచితంగానే వైద్యం అందిస్తున్నారు. ఇందుకోసం ఇక్కడ అధునాత మౌలిక సదుపాయాలతో 110 పడకలు, ICU విభాగం అందుబాటులో ఉండటంతో బాధితులకు ప్రయోజనం కలుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+