10 లక్షల మందికి 'ఏఐ' లో ఫ్రీ కోచింగ్.. జ్యాబ్ గ్యారంటీ భయ్యా..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగం నడుస్తోంది. నేటి యువత ఉపాధి, ఉద్యోగాల్లో అవకాశాలు అంది పుచ్చుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆరి తేరాల్సిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోయింది. ఏఐ సాంకేతికత ప్రతి రంగంలోనూ వ్యాప్తి చెందుతోంది. మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లు, సమస్యలను ఏఐ సెకన్ల వ్యవధిలోనే సమాధానం అందిస్తోంది. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ది చెందుతోంది. నేటి యువత అటు విద్యాపరంగా లేదా ఉద్యోగ పరంగా లేదా వ్యాపార పరంగానైనా కచ్చితంగా ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. యువత ఏఐ శిక్షణ తీసుకోవాలని భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఉన్నాయని తెలిపింది.
ఇటీవల డిజిటల్ ఇండియా 10 ఏళ్ల వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. త్వరలో పది లక్షల మందికి ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో శిక్షణ ఇస్తామని తెలిపారు. అలాగే డిజిటల్ ఇండియా పథకాన్ని ఏఐతో అనుసంధానం చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా యూపీఐ సేవలను తీసుకొచ్చామని తెలిపారు. ప్రస్తుతం టీ, కూరగాయలు అమ్మే ప్రతి వ్యక్తి వద్ద యూపీఐ ఉందన్నారు. అలాగే భవిష్యత్తులోనూ ప్రతి ఒక్కరూ ఏఐను వినియోగిస్తారని అందులో భాగంగా నేటి యువత ముందుగానే ఈ టెక్నాలజీకి అలవాటు పడాలని తెలిపారు. మరోవైపు ఏఐతో ప్రజల జీవితాలను మెరుగపరచాలని, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వ్యవస్థల్లో ఈ టెక్నాలజీ వాడకాన్ని పెంచాలని అన్నారు.












Click it and Unblock the Notifications