'ఏఐ' లో చైనా జెట్ స్పీడ్.. అమెరికాకు బిగ్ ఛాలెంజ్..!

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ఏఐలో ప్రావీణ్యం సాధించేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక వాజిజ్యం పరంగా అగ్ర దేశాలుగా ఉన్న అమెరికా, చైనా నువ్వా.. నేనా అన్నట్లుగా ఏఐ సాంకేతికతలో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఏఐ గ్లోబల్ పవర్ కరెన్సీగా మారింది. 2030 నాటికి ఏఐలో ప్రపంచాన్ని శాసించేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోంది. అందువల్లనే బిలియన్స్ కొద్దీ నిధులను ఏఐ స్టార్టప్స్ కు వినియోగిస్తోంది. ఈ మేరకు డీప్ సీక్ స్టార్టప్ ప్రస్తుతం వెస్టర్న్ బ్రాండ్ కు సవాల్ గా మారింది.

చైనాలోని కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాలను అలవరచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ను విస్తృతం చేస్తున్నాయి. అయితే అమెరికాలోని కంపెనీలు మాత్రం ఏఐ వినియోగంలో సీక్రెట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని ఇన్నోవేషన్ ను బయటకు పంపించేందుకు అగ్రరాజ్యం ఆసక్తిగా లేదు. అమెరికా చిప్స్ ను ఇతర దేశాలకు ఎగుమతి నిషేధించింది. అలాగే ఇతర ఏఐ టూల్స్.. తదితర వాటిని ఇతర దేశాలకు యాక్సెస్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

China s AI Empire Billions Poured into Startups to Crown Global Supremacy by 2030

అయితే చైనా మాత్రం ఏఐ పరిధిని ప్రపంచదేశాలకు విస్తరిస్తూ వస్తోంది. ప్రస్తుతం టాప్ 20 ఏఐ మోడల్స్ లో చైనా కు సంబంధించినవే 14 ఉండటం గమనార్హం. 2030 నాటికి ఏఐ లో గ్లోబల్ పవర్ గా మారాలని 2017 లోనే డ్రాగన్ దేశం కంకణం కట్టుకుంది. ఒక్క 2025 లోనే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిపి 100 బిలియన్ డాలర్లను ఏఐ కోసం చైనా ఖర్చు చేసింది. ఈ క్రమంలోనే డీప్ సీక్ ఏఐ టూల్ ను తీసుకొచ్చింది. వెస్టర్న్ బ్రాండ్స్ అయిన చాట్ జీపీటీ, గ్రోక్ కు బిగ్ ఛాలెంజ్ విసిరింది డీప్ సీక్. అలాగే ఇటీవల అలిబాబా కంపెనీ.. పవర్ ఫుల్ న్యూ ఏఐ మోడల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తూ 2030 నాటికి ఏఐ లో ప్రపంచాన్ని శాసించే దిశగా ముందుకు వెళ్లాలని చైనా యత్నిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+