AI తో ఉద్యోగాలు పోకుండా ఉండాలంటే ? ఏం చేయాలో చెప్పిన లింక్డ్ ఇన్ సీఈవో..!
ఏఐ కారణంగా తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు లింక్డ్ ఇన్ సీఈవో ర్యాన్ రోస్లాన్ స్కీ ఓ కీలక సలహా ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ దూకుడుతో ఉద్యోగాలు వేగంగా ఆవిరైపోతున్నాయి. దాదాపు ప్రతీ సంస్ధ ఏఐ లేకుండా మనుగడ సాగించలేమని భావిస్తుండటంతో ఇప్పటివరకూ ఏదో విధంగా నెట్టుకొచ్చిన ఉద్యోగులంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏఐ కారణంగా తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ వచ్చినా తమ ఉద్యోగాలు ఎలా నిలబెట్టుకోవాలనే దానిపై ఉద్యోగులు మథనం చేస్తున్నారు.
ఇలా ఏఐ రాకతో ఉద్యోగాలు కోల్పోతామని భయపడుతున్న వారికి ప్రముఖ ఉద్యోగాల సెర్చ్ ఇంజన్ ప్లాట్ ఫామ్ లింక్డ్ ఇన్ సీఈవో ర్యాన్ రోస్లాన్ స్కీ తాజాగా ఓ సలహా ఇచ్చారు. కృత్రిమ మేథ ఉద్యోగ మార్కెట్‌ను పూర్తిగా మార్చివేస్తుందని ఆయన తెలిపారు. దీనివల్ల ఉద్యోగులు భారీ ఇబ్బందులు ఎదుర్కొంటారని లింక్డ్‌ఇన్ సీఈఓ ర్యాన్ రోస్లాన్స్కీ హెచ్చరించారు. అయితే ప్రత్యేకంగా మానవులకు మాత్రమే సాధ్యమయ్యే నైపుణ్యాలను అందిపుచ్చుకున్నవారు మాత్రం ఈ సంధి కాలాన్ని దాటుకుని నిలదొక్కుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ మార్పు చాలా సులభంగా జరుగుతుందని నమ్మడం అవివేకం అవుతుందని ఆయన తెలిపారు. దీనిలో చాలా ఆటంకాలు ఉంటాయని, మార్గమధ్యంలో చాలా అనిశ్చితి ఉంటుందని అని రోస్లాన్స్కీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏఐ ప్రభావం గురించి వాస్తవాలను తెలుసుకోకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయకూడదని ఆయన ఉద్యోగులకు సలహా ఇచ్చారు. ఇది అసాధ్యమని మీరు అనకూడదు, దానిలోకి దూకి, పరిస్థితులకు అనుగుణంగా మారాలని ఆయన సూచించారు..
వాస్తవానికి లింక్డ్‌ఇన్ డేటా ప్రకారం, గత సంవత్సరంలో ఉద్యోగ ప్రకటనలలో ఏఐ సంబంధిత నైపుణ్యాల అవసరం 6 రెట్లు పెరిగింది. అయితే వారి ప్రొఫైల్‌లకు ఏఐ నైపుణ్యాలను జోడించే సభ్యుల సంఖ్య కూడా 20 రెట్లు పెరిగింది. అయితే ఏఐ సామర్థ్యాలు ఎంత ఉన్నప్పటికీ, ఒక ఆటోమేటెడ్ ప్రపంచంలో మానవ నైపుణ్యాలు చాలా ముఖ్యమని రోస్లాన్స్కీ తెలిపారు. మీలో ప్రత్యేకంగా మానవులకు మాత్రమే సాధ్యమయ్యేది ఏదైనా ఉంటే, దానిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. కమ్యూనికేషన్, సహకారం వంటి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. మరోవైపు ఉద్యోగ మార్పుల సమయంలో ఉద్యోగులకు సహాయం చేయడానికి తమ సంస్థ లింక్డ్‌ఇన్ సిద్ధంగా ఉందని ర్యాన్ రోస్లాన్స్కీ తెలిపారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, కెరీర్‌ను మార్చుకోవడం వంటి విషయాల్లో లింక్డ్‌ఇన్ సహాయం చేస్తుందన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications