'ఏఐ' వల్ల ఉద్యోగం, డబ్బు ప్రాముఖ్యత తగ్గిపోతుంది.. మస్క్ సంచలనం

స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), రోబోటిక్స్ యుగం నడుస్తోందని తెలిపారు. వీటి వినియోగం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. రాబోయే 10-20 ఏళ్లలో ఏఐ, రోబోటిక్స్ వల్ల వర్క్ అనేది ఆప్షనల్ అవుతుందని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ అంటే డబ్బు చుట్టూనే తిరగడం కాకుండా కొత్త దారిలో ఆర్థిక వ్యవస్థను మలిచేందుకు ఇవి తోడ్పడతాయని ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.

స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్రపంచ కుబేరుడు, గ్రోక్ ఏఐ టూర్ అధినేత ఎలాన్ మస్క్.. భవిష్యత్తులో ఉపాధి, ఉద్యోగాలు ఎలా రూపాంతరం చెందుతాయన్న దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్- సౌదీ పెట్టుబడుల ఫోరమ్ లో మాట్లాడుతూ.. వచ్చే 10-20 ఏళ్లలో వర్క్ అనేది ఆప్షనల్ అవుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగం, ఉపాధి అనేది ఆప్షనల్ అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం అనేక రంగాల్లో ఏఐ, రోబోటిక్స్ గణనీయంగా పెరుగుతున్న తరుణంలో.. రెగ్యులర్ జాబ్స్ కచ్చితం కాదన్న ఆలోచనను ఆయన ఈ వేదికపై వివరించారు.

ఇది ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. 10 ఏళ్లు కానీ 20 ఏళ్లు కానీ పట్టొచ్చు. నా అంచనా ప్రకారం వర్క్ అనేది ఆప్షనల్ మాత్రమే. రానున్న 10-20 ఏళ్లలో ఇలా జరగొచ్చు. ఈ మేరకు ఉద్యోగానికి, హాబీస్ కు లింక్ పెడుతూ ఆయన మాట్లాడారు. స్పోర్ట్స్ లేదా వీడియో గేమ్స్.. ఎలాగైతే ఎంజాయ్ కోసం ఆడతామో.. అలాగే ఉద్యోగం కూడా ఆప్షనల్ అవుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో ఏఐ, రోబోటిక్స్ సాంకేతికత గణనీయంగా విస్తరిస్తున్నట్లు వివరించారు.

Elon Musk s Shocking Prediction Jobs Optional in 10-20 Years Thanks to AI amp amp Robots

నా అంచనా కరెక్ట్ అయితే.. ఏఐ, రోబోటిక్స్ రంగాలు ఇలానే అభివృద్ధి చెందితే.. డబ్బు ప్రాముఖ్యత భవిష్యత్తులో తగ్గిపోతుందని వివరించారు. రోబో ఇండస్ట్రీ మరింత పెరుగుతుందని.. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీల కంటే ఇవి మరింతగా పెరుగుతాయని ఎలాన్ మస్క్ అంచనా వేశారు. ప్రతి మానవుడి జీవితాన్ని మరింత బెటర్ చేసేందుకు ఏఐ, రోబోటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఆయన వ్యూ ప్రకారం.. ఈ టెక్నాలజీల గణనీయమైన అభివృద్ధి కారణంగా సంప్రదాయ ఉద్యోగాల మీద ప్రజలు ఆధారపడడం తగ్గిపోతుందని.. దానివల్ల ప్రపంచ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ రీ షేప్ అవుతుందని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+