Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మనుషుల పనికి ఎసరు?: ఫ్యాక్టరీ పనుల్లో ఇక రోబోల రాజ్యమేనా?

CES 2026: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ రోబోటిక్స్ రంగంలో విప్లవం సృష్టించేందుకు సిద్ధమైంది. జనవరి 5 నుంచి లాస్ వేగాస్‌లో ప్రారంభం కానున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES 2026) వేదికగా తన మొట్టమొదటి ఏఐ హ్యూమనాయిడ్ రోబో 'అట్లాస్(Atlas)'ను ప్రపంచానికి పరిచయం చేయనుంది. అమెరికన్ కంపెనీ 'బోస్టన్ డైనమిక్స్' సహకారంతో రూపొందించిన ఈ రోబోట్ భవిష్యత్తులో ఫ్యాక్టరీల పనితీరును పూర్తిగా మార్చేయనుంది.

ఏంటీ 'అట్లాస్(Atlas)'రోబోట్?
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ అభివృద్ధి చేసిన ఈ అడ్వాన్స్‌డ్ రోబోట్ కేవలం ప్రదర్శనకే పరిమితం కాకుండా నిజమైన పని వాతావరణంలో పనిచేసేలా తీర్చిదిద్ధబడింది. ఈ హ్యూమనాయిడ్ రోబో మనుషుల తరహాలోనే కదలికలను కలిగి ఉండి ఫ్యాక్టరీల్లో క్లిష్టమైన పనులను ఈజీగా చేయగలదు. సాధారణ కార్మికుల కంటే వేగంగా, అలసట లేకుండా పనిచేయడం దీని ప్రత్యేకత. దీనివల్ల కార్ల ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరుగుతుందని హ్యూందాయ్ భావిస్తోంది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఈ రోబోట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలదు.

End of Human Labor Hyundai to Unveil AI Humanoid Robot Atlas at CES 2026

ఫ్యాక్టరీల్లో కార్మికుల స్థానంలోకి?
హ్యుందాయ్ తన ఫ్యాక్టరీలను 'సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫ్యాక్టరీలుగా' మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మనుషులు, రోబోలు కలిసి పనిచేసే వ్యవస్థను రూపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే అత్యంత వేగంగా పనులు చేసే ఈ రోబోలు భవిష్యత్తులో మానవ శ్రమను రీప్లేస్ చేస్తాయా అనే చర్చ కూడా మొదలైంది.

బ్యాటరీ రీసెర్చ్ సెంటర్‌పై భారీ పెట్టుబడి
కేవలం రోబోటిక్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలోనూ హ్యుందాయ్ దూసుకుపోతోంది. దక్షిణ కొరియాలోని అన్సియాంగ్‌లో 'ఫ్యూచర్ మొబిలిటీ బ్యాటరీ క్యాంపస్' పేరుతో భారీ పరిశోధనా కేంద్రాన్ని నిర్మిస్తోంది. మారు 1.2 ట్రిలియన్ వాన్ల (దాదాపు 818 మిలియన్ డాలర్లు) భారీ వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. ,11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పడుతున్న ఈ సెంటర్, 2026 చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ అత్యాధునిక బ్యాటరీ సెల్ డిజైన్, కంట్రోల్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తారు. ఇవి కేవలం ఎలక్ట్రిక్ కార్లకే కాకుండా, రోబోటిక్ రంగంలో వాడే బ్యాటరీలకు కూడా ఉపయోగపడతాయి.

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2026లో హ్యుందాయ్ ప్రదర్శించబోయే ఈ ఏఐ రోబోట్, రోబోటిక్స్ వ్యూహం ప్రపంచ పారిశ్రామిక రంగాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందో చూడాలి. టెక్నాలజీ పెరిగేకొద్దీ మనిషి పని భారం తగ్గుతుందా లేదా ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+