ఏఐ సాయంతో వీర్య కణాలకు DNA పరీక్ష.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతి రంగంలో ఏఐ సాంకేతికత వ్యాప్తి చెందుతోంది. మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లు, సమస్యలకు ఏఐ సెకన్ల వ్యవధిలోనే సమాధానం అందిస్తూ ఔరా అనిపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ది చెందుతుందని నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. నేటి యువత అటు విద్యాపరంగా లేదా ఉద్యోగ పరంగా లేదా వ్యాపార పరంగానైనా కచ్చితంగా ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటు ఆరోగ్య రంగంలోనూ ఏఐ తన పనితనాన్ని ప్రదర్శిస్తోంది.

అయితే తాజాగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఫెర్టిలిటీ సమస్యలకు చెక్ పెట్టవచ్చని హైదరాబాద్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లోని ఫెర్టి 9 హాస్పిటల్ లో ఏఐ సేవలను ప్రారంభించారు. ఏఐ ద్వారా లెన్స్ హుక్ ఎక్స్ 12 టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. జులై 25 ప్రపంచ ఐవీఎఫ్ డే సందర్భంగా ఈ ఆస్పత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటి లయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఐ టెక్నాలజీ ద్వారా అతి తక్కువ సమయంలోనే మగవారిలో వీర్యకణాలు పరిశీలించి డీఎన్ఏ లోపాలను గుర్తించవచ్చని వైద్యులు తెలిపారు.

Ferty9 in Hyderabad Pioneers AI-Assisted Sperm DNA Testing for Advanced Fertility Solutions

ప్రస్తుతం జీవనశైలి, ఆహారశైలి కారణంగా సంతాన సమస్యలు అధికం అయ్యాయని ఏఐ సాంకేతికతో మగవారిలో లేదా ఆడవారిలో సంతాన సమస్యలను గుర్తించి తగు చికిత్స అందించవచ్చని ఫెర్టి 9 ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఏఐ.. వైద్య రంగంలోనూ పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడంలో కృషి చేస్తుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+