AI కి పవర్ హౌస్: ఐటీ కంపెనీల కంటే ఎక్కువ శాలరీ..!!

గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) లకు భారత్.. కేంద్ర బిందువుగా అవతరించింది. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ సెంటర్లు నేడు మల్టీనేషనల్ కంపెనీలు, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాలను ఆకర్షిస్తోన్నాయి. భారత టెక్ జాబ్ మార్కెట్‌లో గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయి. దేశీయ టెక్ రంగాన్ని నడిపించే వ్యూహాత్మక ఇన్నోవేషన్ హబ్స్ గా రూపాంతరం చెందుతున్నాయి. ఈ జీసీసీల ద్వారా ప్రపంచీకరణ, ప్రతిభ గుర్తించే విధానంలో ప్రపంచ వ్యాపార రంగాన్ని పునర్నిర్మిస్తోన్నాయి.

జీసీసీలు తక్కువ ఖర్చుతో కూడిన సేవా కేంద్రాలు అనే భావన ఇప్పుడు సమసిపోయినట్టయింది. వ్యయ తగ్గింపుతో కూడిన సర్వీస్ డెలివరీ మోడల్‌ నుండి ప్రత్యేక సామర్థ్యాలతో కూడిన వ్యూహాత్మక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటోన్నాయి. దేశంలో 1,600 పైగా జీసీసీలు ఉన్నాయంటే ఇవి పురోగమిస్తోన్న వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 1.5 మిలియన్ల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయి.

GCCs Pay More For Engineers And AI Talent Than IT Firms

2030 నాటికి 2,400 కేంద్రాలు ఆవిర్భవిస్తాయని, మార్కెట్ విలువ 110 బిలియన్ డాలర్లకు అంటే సుమారు 9.1 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్ ఫార్మేషన్ వంటి వినూత్న అంశాలు ప్రధాన కేంద్రంగా జీసీసీలు తడాఖా చూపుతున్నాయి. ఐటీ సంస్థల కంటే కూడా జీసీసీలు నాలుగు రెట్లు వేగంగా ఉద్యోగులను నియమిస్తోన్నాయి.

టీమ్‌లీజ్ డిజిటల్ ప్రకారం- GCC నియామకాలు ఏటా 18-27 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. ఐటీ రంగంలో ఈ సంఖ్య 4-6 శాతానికే పరిమితం. ప్రస్తుతం జీసీసీల్లో దాదాపు రెండు మిలియన్ల మంది నిపుణులు పనిచేస్తున్నారు. 2022లో ఈ సంఖ్య 1.2 మిలియన్లు మాత్రమే. ఏటా 3,00,000 ఉద్యోగాలను సృష్టిస్తుండగా ఐటీ సంస్థలు సగటున 25,000-40,000 మాత్రమే చేర్చుకుంటున్నాయి. ఈ ఏడాదిలో 90కి పైగా కొత్త జీసీసీలు దేశంలో ఊపిరి పోసుకున్నాయి.

ప్రస్తుతం 5.8 మిలియన్ల ఐటీ నిపుణులతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామికశక్తిని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం కూడా 1.5 మిలియన్ల ఇంజినీర్లు, 1,20,000 మంది ఐటీ గ్రాడ్యుయేట్లు జాబ్ మార్కెట్ లో అడుగు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జాబ్ మార్కెట్ లో నెలకొన్న విపరీతమైన డిమాండ్ ను జీసీసీలు అందుకుంటోన్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల డిమాండ్‌ను తీరుస్తున్నాయి.

Take a Poll

నాస్కామ్ అంచనా ప్రకారం- 2026 నాటికి 300 బిలియన్ డాలర్లు అంటే సుమారు 24.8 లక్షల కోట్ల రూపాయల ఆదాయంతో ప్రపంచ టెక్ రంగంలో భారత్ ఓ పవర్‌హౌస్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, హైపర్‌ ఆటోమేషన్ల ఏకీకరణ ప్రపంచ స్థాయిలో శరవేగంగా జరుగుతన్న ప్రస్తుత పరిస్థితుల్లో జీసీసీలు దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా నిలుస్తోన్నాయి. ఐటీ రంగానికి మాత్రమే కాకుండా ఫైనాన్స్, సప్లయ్ చైన్, కస్టమర్ సర్వీస్ ఆప్టిమైజేషన్‌లోనూ వ్యూహాత్మక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రొక్యూర్మెంట్ రంగంలో- ఆన్‌బోర్డింగ్ ఆటోమేషన్, ఏఐ-ఆధారిత కాంట్రాక్ట్ నిర్వహణ, వ్యయ ఆప్టిమైజేషన్ కోసం ప్రిడిక్టివ్ అనలిటిక్స్‌తో ప్రొక్యూర్-టు-పే (P2P) లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. ఇది కొనుగోలుదారులు, సరఫరాదారుల మధ్య సహకారాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఆర్థిక రంగంలో క్యాష్ అప్లికేషన్, ఆర్థిక అంచనా ఖచ్చితత్వాన్ని పెంచుతాయి. ఆటోమేటెడ్ డేటా ధృవీకరణతో రికార్డ్-టు-రిపోర్ట్ (R2R) సైకిల్ ను రెగ్యులరైజ్ చేయగలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+