అసలైన ప్రమాదం AI కాదు.. అదే.. ' గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ ' సంచలనం

'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ' గా పేరుపొందిన జాఫ్రే హింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) లక్షల మంది ఉద్యోగాలను తొలగించగలదని అన్నారు. కానీ రియల్ డేంజర్ ఏఐ కాదని.. సమాజంలోని ప్రజల ఛాయిస్ అని తేల్చారు. ప్రస్తుత ఆర్థిక విధానాలు షార్ట్- టర్న్ ప్రాఫిట్స్ వైపే మొగ్గు చూపుతున్నాయని.. హ్యూమన్ వెల్ బీయింగ్ పై కాదని తెలిపారు. ఏఐ ను మానవుడి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు కాకుండా, సమాజంలో అసమానత్వాన్ని తొలగించేందుకు కాకుండా ఉద్యోగులను తొలగించి లేబర్ ఖర్చులను తగ్గించుకునేందుకు వాడుతున్నారని అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తులో పని విధానంపై గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జాఫ్రే హింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిలియన్ ప్రజల ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొలగించే అవకాశం ఉందని అన్నారు. కానీ రియల్ డేంజర్ టెక్నాలజీ కాదని.. కానీ సమాజం ఆ సాంకేతికతను ఎలా వినియోగించుకుంటుంది.. అనే దానిపైనే అని తెలిపారు. బ్లూబ్ బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Godfather of AI Drops BOMB The Real Danger is NOT AI

అసలైన ప్రమాదం ఏఐ తో కాదని.. సమాజం, ఎకానమీ.. సాంకేతికతను ఎలా వినియోగించుకుంటుంది అనేది అని అభిప్రాయపడ్డారు. ఏఐ క్రమేనా అభివృద్ధి చెందుతోందని అన్నారు. కస్టమర్ సర్వీసెస్ నుంచి లీగల్ రీసెర్చ్ , క్రియేటివ్ రైటింగ్ వరకు ఇలా ప్రతీ రంగంలో ఏఐ తన ప్రతిభను కనబరుస్తోందని తెలిపారు. ఏఐ విస్తరణ కారణంగా బ్లూ కాలర్, వైట్ కాలర్ జాబ్స్ కు ప్రమాదం అని అభిప్రాయపడ్డారు. ఏఐ ప్రభావం వివిధ రంగాల ఉద్యోగులపై పడకుండా ముందుగానే పలు పాలసీలు తీసుకురావాలని సూచించారు. యూనివర్సల్ బేసిక్ ఇన్ కమ్, లేబర్ పాలసీలు, ఏఐ ప్రపంచంలో పనికి గుర్తింపు ఇలా.. తదితర అంశాలను పరిశీలించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+