గూగుల్ Veo 3 భారత్‌లో లాంచ్.. వీడియో సృష్టికి కొత్త దారి
గూగుల్ తమ కొత్త AI వీడియో టూల్ Veo 3 ను ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది Gemini యాప్ లో AI ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి లభిస్తుంది. ఈ రోజు నుంచి, జెమిని యాప్ అందుబాటులో ఉన్న ప్రతి దేశంలో, భారత్‌తో పాటు Veo 3ను విడుదల చేస్తున్నామని Google ప్రకటించింది.
Veo 3 అంటే ఏంటి?
Veo 3 ఒక కొత్త టెక్నాలజీ టూల్. దీని ద్వారా కేవలం కొన్ని పదాలతో (ప్రాంప్ట్‌తో) మీరు 8 సెకన్ల వీడియోలను సులభంగా తయారుచేయొచ్చు. వీటిలో ఆడియో (సింథసైజ్డ్ స్పీచ్), బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే సినిమాలా ఉండే చిన్న వీడియోలను మీరు తయారు చేయవచ్చు.

కొద్ది వారాల క్రితం Google I/O ఈవెంట్‌లో తొలిసారి Veo 3ను పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. చరిత్రలో జరిగిన సంఘటనల పునర్నిర్మాణం నుంచి పురాణాల్లోని జీవులతో కల్పిత కథలు వరకూ అనేక రకాల వీడియోలు అందులో తయారు చేశారు.
ఈ సందర్భంగా ఓపెన్ AI సహవ్యవస్థాపకుడు ఆండ్రీ కార్పతి మాట్లాడుతూ.. వీడియోలు తయారు చేసే, చూసే పద్ధతిని Veo 3 పూర్తిగా మార్చేస్తోందని తెలిపారు. ఇది భవిష్యత్తులో భారీ మార్పులకు నాంది అని చెప్పారు. చదవడం, రాయడం కంటే వీడియోలు చూడడం అందరికీ సులభం కాబట్టి, ఇప్పుడు కంటెంట్ సృష్టి మరింత యాక్సెసిబుల్ అయిపోయిందని చెప్పారు.
Google Veo 3ను ఉపయోగించే ప్రతి ఒక్కరికి సురక్షితమైన, బాధ్యతాయుతమైన అనుభవం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. అందుకోసం వీడియోలు AI తో తయారైనవని గుర్తించేందుకు కనబడే వాటర్ మార్క్.. అలానే బయటికి కనిపించని Synth ID ఉంటుందని పేర్కొన్నారు. దీని వల్ల వీడియో మూలం ఎక్కడినుంచి వచ్చిందో గుర్తించడం సులభమవుతుందని వివరించారు.
ఈ కొత్త టూల్ వల్ల వీడియో మేకర్లు వీడియోలు త్వరగా, సులభంగా రూపొందించవచ్చని.. విద్యార్థులు ప్రెజెంటేషన్లు, ప్రాజెక్ట్ వీడియోలు సృష్టించొచ్చని తెలిపారు. సాధారణ వినియోగదారులు తమ ఊహల్లోని విషయాలను వీడియో రూపంలో చూడొచ్చని చెప్పుకొచ్చారు. మీరు కూడా Gemini యాప్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించి వీడియోలను తయారు చేసి చూడండి.












Click it and Unblock the Notifications