కృత్రిమ మేధకు ఆ ఒక్క హక్కు ఇస్తే.. మానవజాతి అంతమే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకు అసాధారణ వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ఏఐ టూల్స్‌కు కూడా మానవుల మాదిరిగానే ప్రాథమిక హక్కులు కల్పించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఆలోచనను ఏఐ పితామహులలో ఒకరైన యోషువా బెంగియో తీవ్రంగా వ్యతిరేకించారు. 'ది గార్డియన్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భవిష్యత్తులో పొంచి ఉన్న ముప్పు గురించి వివరించారు.
ఏలియన్లకు పౌరసత్వం ఇచ్చినట్లే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు హక్కులు కల్పించాలనే ప్రతిపాదనను బెంగియో వింతగా అభివర్ణించారు. ఏఐకి హక్కుల ఇవ్వడమంటే.. భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసులకు పౌరసత్వం ఇవ్వడంతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని తేలికగా తీసుకోకూడదని, ఇది మానవాళికి పెనుముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించారు.

నియంత్రణ కోల్పోయే ప్రమాదం
ఏఐకి చట్టపరమైన హక్కులు కల్పిస్తే వచ్చే ప్రధాన సమస్యలు ఇవే..
షట్‌డౌన్ చేయడం అసాధ్యం: ఒకసారి ఏఐకి హక్కులు లభిస్తే, దానిని స్విచ్ ఆఫ్ చేయడం లేదా నియంత్రించడం చట్టవిరుద్ధం కావచ్చు. కొన్ని ఏఐ మోడల్స్ ఇప్పటికే తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.
మానవులపై ఆధిపత్యం: భవిష్యత్తులో రాబోయే ఏజీఐ (AGI - Artificial General Intelligence) మోడల్స్ మానవుల మాదిరిగానే ఆలోచిస్తాయి. వాటికి హక్కులు ఇస్తే.. అవి మానవుల మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తాయి.
వినాశనానికి దారి: ఏఐ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, దానిని ఆపే అధికారం మానవులకు లేకపోతే అది విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది.
నిపుణుల ఆందోళన
యోషువా బెంగియోతో పాటు మరో ఇద్దరు ఏఐ దిగ్గజాలు జియోఫ్రీ హింటన్, యాన్ లెకున్ కూడా ఏఐ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏఐ కేవలం ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా కాకుండా, సొంతంగా ఉనికిని చాటుకోవాలని చూస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. కంప్యూటర్ వాడకం తర్వాత దానిని ఆఫ్ చేసినప్పుడు అది 'ఆఫ్ అవ్వను' అని మొండికేస్తే ఎంత ప్రమాదమో, ఏఐ విషయంలో కూడా అదే జరగవచ్చని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications