IPL 2027: ఐపీఎల్ లో ఎంట్రీకి పాక్ క్రికెటర్ ? -బీసీసీఐ నిర్ణయంపై ఉత్కంఠ ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాకిస్తాన్ (Pakistan) మినహా అన్ని దేశాల క్రికెటర్లు పాల్గొనేందుకు అవకాశం ఉంది. పాకిస్తాన్ తో భారత్ సంబంధాలు తెంచుకోవడంతో ఇలా ఆ దేశ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడలేకపోతున్నారు. అయితే తాజాగా ఓ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మాత్రం ఐపీఎల్ లో ఎలాగైనా ఎంట్రీ తీసుకోవాలని భావించి ఓ అడ్డదారిని ఎంచుకున్నాడు. పాకిస్తాన్ పౌరసత్వాన్ని వదిలేసి బ్రిటీష్ పౌరసత్వం తీసుకున్నాడు. ఇప్పుడు అతను బ్రిటీష్ పౌరుడు, క్రికెటర్ కాబట్టి ఐపీఎల్ లో అతనికి ఎంట్రీ ఇస్తారా లేదా అన్నదే ఇక్కడ సస్పెన్స్.

పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ (Mohammad Amir)తాజాగా బ్రిటీష్ పౌరసత్వం తీసుకున్నాడు. అప్పటి నుంచీ అందరి దృష్టీ అతనిపై పడింది. ముందుగా 'ది హండ్రెడ్' లీక్ లో విదేశీ ఆటగాడిగా ప్రవేశించిన అమీర్.. ఇప్పుడు యూకేలో జరిగే ఈ పోటీల్లో
ట్రెంట్ రాకెట్స్ తరఫున స్థానిక ఆటగాడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీని తర్వాత ఐపీఎల్ 2027 (IPL 2027)లో కూడా ఎంట్రీ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అమీర్ ఐపీఎల్ లో ఆడటం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుత ఐపీఎల్ నిబంధనలు అందుకు అనుమతిస్తున్నాయి. దీంతో అభిమానులు షాకవుతున్నారు.

From Pakistan to UK citizen Amir s indirect path to IPL 2027 raises BCCI question

అయితే అమీర్ తాజాగా ఐపీఎల్ ఆడటంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రస్తుతానికి తన ప్రాధాన్యత పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మాత్రమేనని తెలిపాడు. ఐపీఎల్‌లో ఆడే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. పీఎస్ఎల్ లో మాత్రం విదేశీ ఆటగాడిగా బరిలోకి దిగుతున్నట్లు అమీర్ వెల్లడించాడు. ఐపీఎల్ విషయానికొస్తే, తాను పాల్గొంటానో లేదో ఇంకా తెలియదన్నాడు. గతంలో పాకిస్తాన్ మాజీ ఆల్-రౌండర్లు అజహర్ మహమూద్, షాహిద్ అఫ్రిదీ వంటి వారు ఐపీఎల్ లో ఆడారు. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి అమీర్ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లీగ్స్ లో మాత్రం ఇప్పటికీ ఆడుతున్నాడు. అతను ఐపీఎల్ లో ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకుంటే బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+