ఉద్యోగాలు చేసే నేటి మహిళలకు ఇంటిపనులు సునాయాసంగా..ఏఐతో స్మార్ట్ హోమ్స్!

భారతదేశంలో ఉద్యోగాలు చేసే మహిళల కోసం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇళ్లల్లో పనులు చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదం చేస్తుంది. ప్రతిరోజు పని ఒత్తిడితో, బిజీ షెడ్యూల్స్ తో ఎంతోమంది బిజినెస్ ప్రొఫెషనల్స్ కు ఇల్లు శుభ్రంగా నిర్వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే క్లీనింగ్ పరికరాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి .ఇవి వారి పనిని సులభతరం చేస్తున్నాయి. ఇళ్లను స్మార్ట్ హోమ్స్ గా మారుస్తున్నాయి.

ఇళ్ళ శుభ్రతలో AI-పవర్‌డ్ క్లీనింగ్ పరికరాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు ఇళ్లను శుభ్రం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ పరికరాలు కమాండ్ ఇవ్వడం ద్వారా వాటికవే పని చేస్తూ ఇళ్లను శుభ్రంగా ఉంచుతున్నాయి. ఫ్లోర్ ను సమర్థవంతంగా శుభ్రం చేస్తున్నాయి. అవి శుభ్రం చేసే క్రమంలో వచ్చిన అడ్డంకులను నివారించడానికి సెన్సార్‌లను ఉపయోగిస్తాయి .రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లు ప్రతి మూలను కవర్ చేస్తాయి.

House cleaning made easy with AI claening tools for today working women professionals

ఉద్యోగాలు చేసే మహిళలకు ఉపయోగం

కొన్ని మోడళ్లు బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు తమ ఛార్జింగ్ స్టేషన్లకు తిరిగి వెళ్లి చార్జింగ్ చేసుకుని మళ్లీ పని మొదలు పెడతాయి. AI-ఎనేబుల్‌డ్ మాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ గాడ్జెట్‌లు మురికి గుర్తించి, వారి శుభ్రతా పద్ధతులను అనుగుణంగా పనిచేస్తాయి. ఇవి ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళల సమయాన్ని సేవ్ చేస్తున్నాయి. మానవ జోక్యం లేకుండా శుభ్రతకు అద్దం పడుతున్నాయి.

స్మార్ట్ ఫోన్లో వాయిస్ కమాండ్ లతో స్మార్ట్ వర్క్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే చాలా ఏఐ క్లీనింగ్ పరికరాలు స్మార్ట్ ఫోన్ల ద్వారా లేదా alexa, google assistant వంటి వర్చువల్ అసిస్టెంట్ల ద్వారా వాయిస్ కమాండ్ లతో నియంత్రించడానికి వీలవుతుంది. ఈ సౌలభ్యం వినియోగదారులకు ఇంట్లో లేనప్పుడు కూడా శుభ్రతను షెడ్యూల్ చేసుకోవడానికి పనికి వస్తుంది. షెడ్యూల్ చేసిన సమయంలో కూడా ఈ ఏఐ టూల్స్ వాటి పని అవి చేసుకుని పోతాయి.

ఇంటి పనుల భారం తగ్గించి స్మార్ట్ హోమ్స్ గా మార్చే ఏఐ

బాగా బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ కు ఇవి ఇంటి పనుల భారాన్ని తగ్గిస్తున్నాయి. ఈ సాంకేతికత నిత్యం ఇల్లు పరిశుభ్రంగా ఉండేలా చేస్తోంది. అయితే దీనివల్ల మానవ వనరుల వినియోగం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక స్మార్ట్ ఆలోచనగా నేటి మహిళలకు ఇళ్లను స్మార్ట్ హోమ్స్ గా ఉంచడంలో కీలకంగా ఉపయోగపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+