Infosys గుడ్ న్యూస్: భారీ హైరింగ్- ఫ్రెషర్లకు పండగే
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభంజనం టెక్ రంగాన్ని కుదిపేస్తోంది. వేలాదిమంది టెక్కీలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ నిమిషంలో ఉద్యోగం పోతుందోననే ఆందోళనకు గురి చేస్తోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, అమెజాన్, మెటా.. వంటి అనేక సాఫ్ట్ వేర్ దిగ్గజాలు లేఆఫ్స్ బాట పట్టాయి. కొత్త ఉద్యోగాల నియమాకాలను నిలిపివేయడంతో పాటు ఉన్న వారికీ అప్రైజల్స్ ను ప్రకటించడంలో జాప్యం చేస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ శుభవార్త వినిపించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. ఏఐ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా 2027 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 20,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం టెక్ ప్రపంచంలో సంతోషాన్ని నింపింది. దీనికోసం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహించనుంది ఇన్ఫోసిస్.

ఈ భారీ నియామక ప్రణాళికను ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో ఈ విషయాన్ని ధృవీకరించినట్లు మనీకంట్రోల్ వెల్లడించింది. ఇప్పటికే 2026 మొదటి మూడు త్రైమాసికాల్లో 18,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంది ఇన్ఫోసిస్. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర ఉద్యోగుల సంఖ్య 5,000 మందికి పైగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మొత్తం 20,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
క్లయింట్లు తమ బడ్జెట్లను AI, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వైపు మారుస్తుండడంతో డిమాండ్ స్వరూపం మారుతోందని సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పట్ల క్లయింట్లు పైలట్ ప్రాజెక్ట్‌లకే పరిమితం కావట్లేదని, ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగా్లో దీని అవసరం వేగవంతమౌతోందని చెప్పారు. ఇన్ఫోసిస్ కు చెందిన అతిపెద్ద 25 ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లయింట్లల్లో 15 సంస్థలు AI భాగస్వామిగా ఉన్నాయని వివరించారు. దీంతో ఈ డివిజన్ ను విస్తరించుకుంటోన్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications